ఫుల్‌గా నవ్వులే! | A team reunion almost a year after #DJ | Sakshi
Sakshi News home page

ఫుల్‌గా నవ్వులే!

May 27 2018 12:09 AM | Updated on Aug 22 2019 9:35 AM

A team reunion almost a year after #DJ  - Sakshi

పూజా హెగ్డే, అల్లు అర్జున్, హరీష్‌ శంకర్, అయానంకా బోస్‌

అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా హారీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డీజే (దువ్వాడ జగన్నాథమ్‌). ఈ చిత్రం గత ఏడాది జూన్‌ 23న విడుదల అయ్యింది. అంటే మూవీ రిలీజై ఏడాది కంప్లీట్‌ కావడానికి దాదాపు ఇంకో నెల రోజుల టైమ్‌ ఉంది. అయితే రీసెంట్‌గా ఓ సందర్భంలో ‘డీజే’ టీమ్‌ రీ–యూనియన్‌ అయ్యారు. ‘‘డీజే’ చిత్రం విడుదలై దాదాపు ఏడాది కావొస్తుంది. ఇప్పుడు రీ–యూనియన్‌ అయ్యాం. ఈ గ్రూప్‌తో ఉంటే ఫుల్‌గా నవ్వులే’’ అని పేర్కొన్న పూజా ఇన్‌సెట్‌లో ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఈ సంగతి ఇలా ఉంచితే పూజా హెగ్డే ఈ ఏడాది మాంచి జోరు మీద ఉన్నారు. శ్రీవాస్‌ దర్శకత్వంలో బెల్లకొండ సాయిశ్రీనివాస్‌ హీరోగా రూపొందిన చిత్రం ‘సాక్ష్యం’. ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్‌ చేసిన పూజా ప్రస్తుతం ఎన్టీఆర్‌ హీరోగా రూపొందుతోన్న ‘అరవింద సమేతా వీరరాఘవ’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఇక...వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు, రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోలుగా రూపొందనున్న సినిమాల్లో కూడా కథానాయికగా నటించే చాన్స్‌ను కొట్టేశారు పూజా. ‘అరవింద సమేతా వీరరాఘవ’ చిత్రం ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement