సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం | Tamil film actor attempts suicide in Chennai | Sakshi
Sakshi News home page

సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం

Aug 26 2016 6:08 PM | Updated on Sep 4 2017 11:01 AM

సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం

సహాయ నటుడు ఆత్మహత్యాయత్నం

భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపడంతో విరక్తి చెందిన సినిమా సహాయ నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

తిరువొత్తియూరు: భార్య విడాకులు ఇచ్చేందుకు నోటీసు పంపడంతో విరక్తి చెందిన సినిమా సహాయ నటుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఓనాయుం, ఆటుకుట్టిం, డమాల్ డుమీల్, శకుని తదితర సినిమాల్లో సహాయ నటుడిగా నటించిన అరసు అనే ఇలవరసన్. ఇతను 2012వ సంవత్సరం మార్చి 9వ తేదీన కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు. భార్య ఓ ఫైనాన్స్ సంస్థలో పనిచేస్తున్నారు. వీరికి శివ అనే కుమారుడు ఉన్నాడు.
 
 దంపతుల మధ్య ఏర్పడిన మనస్పర్థలతో ఇద్దరు విడిపోయి జీవిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలవరసన్ విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు.  ఇది చూసిన ఇరుగు పొరుగు వాళ్లు అక్కడికి చేరుకుని విషం తాగి అపస్మారక స్థితిలో ఉన్న ఇలవరసన్‌ను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న కొడుంగయూర్ పోలీసులు విచారణ చేపట్టారు.
 
విచారణలో అతని ఇంట్లో లభించిన ఓ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో సినీ నటుడు నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్‌కు దీనంగా తన బాధను వ్యక్తం చేస్తూ రాసినట్టు తెలిసింది. అందులో తాను ఏడేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నానని తనకు సినిమా రంగంలో తగిన జీతం అందలేదని, దీని వలన కుటుంబంలో తనకు తన భార్యకు మనస్పర్థలు ఏర్పడి విడిపోయామని తాను విరక్తి చెంది ఉన్న సమయంలో తనకు తన భార్య నుంచి విడాకులు కోరుతూ నోటీసు అందిందని, దీని వలన తన కుమారుడికి ఇబ్బందులు గురవుతున్నాడని దీంతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆ ఉత్తరంలో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement