‘ఆ బయోపిక్‌లో నటించాలనుంది’ | Tamannah Wants to Play the Role of Sridevi | Sakshi
Sakshi News home page

‘ఆ బయోపిక్‌లో నటించాలనుంది’

Jun 12 2019 10:07 AM | Updated on Jun 12 2019 10:19 AM

Tamannah Wants to Play the Role of Sridevi - Sakshi

ఆమె అంటే తనకెంత ఇష్టమో అంటున్నారు నటి తమన్నా. 15 ఏళ్ల ప్రాయంలోనే నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ నటిగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దశాబ్దంన్నరగా కథనాయకిగా, అదీ చెక్కు చెదరని అందాలతో అగ్రనాయకిగా రాణిస్తున్న అతి కొద్ది మంది నటీమణుల్లో తమన్నా ఒకరు. మొదట్లో అందాలనే నమ్ముకుని నిలదొక్కుకున్న ఈ మిల్కీబ్యూటీకి బాహుబలి చిత్రం నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈమె ప్రభుదేవాతో రెండోసారి నటించిన దేవి–2 చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఇక మూడోసారి అదే నటుడితో జత కట్టిన హిందీ చిత్రం ఖామోషి త్వరలోనే తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ప్రస్తుతం విశాల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో ఆయనతో రొమాన్స్‌ చేస్తున్నారు. ఇటీవల ఒక భేటీలో తమన్నా పేర్కొంటూ నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు. ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక ఉందని తెలిపారు.

ఈ మధ్య బయోపిక్‌ల కాలం నడుస్తున్న విషయం తెలిసిందే. అలా తెరకెక్కిన చాలా చిత్రాలు సక్సెస్‌ అయి కాసుల వర్షం కురిపించాయి కూడా. ఉదాహరణకు క్రికెట్‌ క్రీడాకారుడు ధోనీ జీవిత చరిత్రతో తెరకెక్కిన ఎంఎస్‌.ధోని, దివంగత శృంగార తార సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన ది దర్టీపిక్చర్, నటుడు సంజయ్‌దత్‌ బయోపిక్‌గా తెరకెక్కిన సంజూ, నటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన మహానటి వంటి చిత్రాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణను పొందిన విషయం తెలిసిందే. 

తాజాగా దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత జీవిత చరిత్రను ఇద్దరు దర్శకులు ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. ఒక చిత్రంలో జయలలిత పాత్రలో తలైవిగా బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్, మరో చిత్రంలో నిత్యామీనన్‌ ది ఐరన్‌ లేడీగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటి తమన్నాకు బయోపిక్‌ చిత్రంపై కన్ను పడినట్లుంది.

గత ఏడాది దుబాయిలో అకాల మరణం పొందిన అందాల నటి శ్రీదేవి జీవిత చరిత్రను ఆమె భర్త, నిర్మాత బోనీకపూర్‌ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుందో, ఏమోగానీ నటి తమన్నా ఆ చిత్రంలో అవకాశం కొట్టేయాలనుకుని చెప్పిందో కాదో గానీ, నటి శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టం అని, ఆమె బయోపిక్‌లో నటించాలన్న కోరిక చాలా కాలంగా ఉందని చెప్పారు.

తమిళం, తెలుగుతో పాటు హిందీలోనూ నేమ్, ఫేమ్‌ ఉన్న తమన్నాకు అలాంటి అవకాశం ఇచ్చే విషయమై బోనీకపూర్‌ ఆలోచిస్తారో లేదో చూడాలి. ఆయన ఇప్పటికే మలయాళీ చిన్నది కీర్తీ సురేశ్‌ను ముంబైకి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. నటుడు అజిత్‌ను హిందీలోకి తీసుకెళ్లడానికి ఆసక్తిగా ఉన్నారు కూడా. కాబట్టి తదుపరి తమన్నాపై కూడా కాస్త దృష్టి పెడితే ఆమె కోరిక తీరుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement