
తమన్నా, దీపికా పదుకోన్
దక్షిణాదిలో కథానాయికగా మంచి పేరు సంపాదించుకున్నారు తమన్నా. సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇటీవల హిందీలో ఓ సినిమాకు సంతకం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నవాజుద్దీన్ సిద్ధిఖీ హీరోగా నటించనున్నారు. కాగా బాలీవుడ్‌లో ఏ హీరోయిన్ వర్కింగ్ స్టైల్ అంటే ఇష్టం? అనే ప్రశ్నను తమన్నా ముందు ఉంచితే...‘‘దీపికా పదుకోన్ వర్కింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం. ఆమె కళ్లు చాలా అందంగా ఉంటాయి.
ప్రయోగాత్మక చిత్రాలను చేయడానికి ఇష్టపడుతుంటారామె’’ అన్నారు. మరి హాలీవుడ్‌లో? అంటే ‘‘ప్రముఖ నటి మెరిల్ స్ట్రిప్స్ అంటే విపరీతమైన అభిమానం. ప్రతి పాత్రలోనూ వైవిధ్యం చూపిస్తారామె. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగలరు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళంలో ‘పెట్రోమాక్స్’ సినిమాతో బిజీగా ఉన్న తమన్నా తెలుగులో ‘దటీజ్ మహాలక్ష్మి, సైరా: నరసింహారెడ్డి’ సినిమాలను పూర్తి చేశారు.