‘మై బాడీ.. మై రూల్స్‌’: నటి సెల్ఫీ వైరల్‌ | Sushmita Sen instagram selfie post viral | Sakshi
Sakshi News home page

‘మై బాడీ.. మై రూల్స్‌’: నటి సెల్ఫీ వైరల్‌

Nov 8 2017 9:52 AM | Updated on Nov 8 2017 10:31 AM

Sushmita Sen instagram selfie post viral - Sakshi

న్యూఢిల్లీ : నాలుగు పదుల వయసులోనూ ఏ విషయంలోనూ రాజీ పడకుండా ధైర్యంగా తన ముందు సవాళ్లను ఎదుర్కొంటోంది బాలీవుడ్‌ నటి సుస్మితాసేన్‌. తన పుట్టినరోజు లోగా తాను ఏం కోరుకున్నాదో అది సాధిస్తానంటూ మాజీ విశ్వసుందరి సుస్మిత ఇటీవల చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఎందుకంటే.. ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోనే అందుకు కారణం. స్లిమ్‌ ఫిట్‌గా ఉండాలని భావించిన సుస్మితా సేన్‌.. తాను ఫిట్‌నెస్‌ కోసం ఎక్కడికి వెళ్లినా అక్కడ ఫొటోలు దిగి ఫాలోయర్లతో ఏ భయం లేకుండా షేర్‌ చేసుకుంటానని తెలిపింది.

‘మై బాడీ.. మై రూల్స్‌’  అంటూ ఆ పోస్ట్‌ చేసిన ఈ బ్యూటీ నవంబర్‌ 19న 42వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. పుట్టినరోజును తన బాడీ లేక ముఖానికి సంబంధించిన విషయాలు షేర్‌ చేసి సెలబ్రేట్‌ చేసుకోవాలని నటి భావిస్తోంది. తాజాగా షార్జా చేరుకున్నాక దిగిన ఓ సెల్పీని పోస్ట్‌ చేయడంతో కేవలం 12 గంటల్లోనే లక్షన్నర లైక్స్‌ రావడం గమనార్హం. ఇక్కడి అల్‌ ఖాసిమా స్ట్రీట్‌లో ఓ స్టోర్‌ను నేటి (బుధవారం) రాత్రి ఏడు గంటలకు ప్రారంభించనున్నట్లు సుస్మితా వెల్లడించారు.​ విక్రమ్‌ భట్‌ విడాకులకు కారణం సుస్మితానే అంటూ ఇటీవల వదంతులొచ్చినా తన తప్పు లేదని పేర్కొన్న ఆమె, ధైర్యంగా అలాంటి సమస్య నుంచి బయటపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement