తమిళసినిమాలో మైలురాయి సూర్యకాంతి | suryakanthi movie 150 days completed | Sakshi
Sakshi News home page

తమిళసినిమాలో మైలురాయి సూర్యకాంతి

Sep 12 2016 1:30 AM | Updated on Sep 4 2017 1:06 PM

తమిళసినిమాలో మైలురాయి సూర్యకాంతి

తమిళసినిమాలో మైలురాయి సూర్యకాంతి

తమిళసినిమాలో సూర్యకాంతి ఓ మైలురాయి అని ఆ చిత్ర దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ పేర్కొన్నారు.

తమిళసినిమాలో సూర్యకాంతి ఓ మైలురాయి అని ఆ చిత్ర దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ పేర్కొన్నారు. నేటి ముఖ్యమంత్రి, ఒక నాటి ప్రఖ్యాత నాయకి జయలలిత నటించిన చిత్రం సూర్యకాంతి. ముత్తురామన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం 1973లో విడుదలై 150 రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. చోరామస్వామి, మనోరమ, మౌళి, కాత్తాడి రామమూర్తి, ఎంఆర్‌ఆర్.వాసు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కథ, మాటలను ఏఎస్.ప్రకాశ్ అందించారు.
 
  విద్యా ఫిలింస్ పతాకంపై వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం 43 ఏళ్ల తరువాత డిజిటల్ హంగులతో సినిమా స్కోప్‌లో రూపొంది ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలకు ముస్తాబవుతోంది. దీన్ని ఏపీ.ఫిలింస్ అధినేత గజలక్ష్మి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చిత్ర దర్శకుడు ముక్తా శ్రీనివాసన్ మాట్లాడుతూ భర్త కంటే భార్య అధికంగా సంపాదిస్తే వారి దాంపత్య జీవితం ఎలాంటి పరిణామాలకు గురైందన్న అంశాన్ని రసవత్తరంగా ఆవిష్కరించిన చిత్రం సూర్యకాంతి అని పేర్కొన్నారు.
 
  ఈగో అన్నది ఎంత ప్రభావం చూపుతుందన్న ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఇద న్నారు. జయలలిత, ముత్తురామన్‌తో పాటు చిత్రంలో నటించిన వారందరూ వారి పాత్రలకు జీవం పోశారన్నారు. ఆ తరం ఈ తరం అని కాదు ఏ తరం వారు అయినా చూసి ఆనందించే కథా చిత్రం సూర్యకాంతి అని ముక్తాశ్రీనివాసన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement