వచ్చేనెలలో పెళ్లి చేసుకోబోతున్న నటి | Suja Varunee to Marry Shivaji Dev in November | Sakshi
Sakshi News home page

Oct 1 2018 8:16 PM | Updated on Oct 1 2018 9:06 PM

Suja Varunee to Marry Shivaji Dev in November - Sakshi

సాక్షి, తమిళ సినిమా : వచ్చేనెల నవంబర్‌లో పెళ్లికి రెడీ అవుతోంది నటి సుజావరూణి. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ అమ్మడు.. కోలీవుడ్‌లో మిలగా చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. గత ఏడాది బిగ్‌బాస్‌ రియాలిటీ గేమ్‌ షోలో పాల్గొని మరింత పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈ అమ్మడు నటించిన చిత్రం ఇరవుక్కు ఆయిరం కన్‌గళ్‌.. ఆమె నటించిన మరో సినిమా వాడీల్‌ విడుదల కావాల్సి ఉంది.

శివాజీగణేశన్‌ మనుమడు, రామ్‌కుమార్‌ కొడుకు అయిన శివాజీదేవ్‌, సుజావరూణి గతకొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శివాజీదేవ్‌ కూడా హీరోగా పరిచయం అయినా, పెద్దగా రాణించలేకపోయాడు. వీరి మధ్య పరిచయం స్నేహంగానూ ఆపై ప్రేమగా మారిందనే తెలుస్తోంది. శివాజీదేవ్, సుజావరూణిలు సన్నిహితంగా ఉన్న ఫొటోలూ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి. అయితే మొదట్లో అలాంటి ప్రచారాన్ని నటి సుజావరూణి ఖండించింది. శివాజీదేవ్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని పేర్కొంది. శివాజీదేవ్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమను నిరాకరించడంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు ప్రచారం జరిగింది. తాజాగా ఈ జంట పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యారు. నిశ్చితార్థం కూడా ఇటీవల జరిగిందట. నవంబర్‌ 19న వీరు పెళ్లి పీటలెక్కనున్నారన్నది తాజా సమాచారం. దీని గురించి నటి సుజావరూణి క్లారిటీ ఇచ్చింది. తనకు శివకుమార్‌ (శివాజీదేవ్‌ శివకుమార్‌ పేరుతో ఇటీవల నటిస్తున్నారు)కు నవంబర్‌లో వివాహం జరగనుందని తెలిపారు. శివకుమార్‌ను పెళ్లి చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement