దబాంగ్‌ 3లో...

Sudeep returns to Bollywood in Dabangg style - Sakshi

‘దబాంగ్‌’ చిత్రం సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో పెద్ద హిట్స్‌లో ఒకటి. ఆల్రెడీ ఈ సినిమాకి ఓ సీక్వెల్‌ కూడా వచ్చింది. ఇప్పుడు మూడో భాగం రూపొందించే పనిలో పడ్డారు హీరో సల్మాన్‌ ఖాన్, దర్శకుడు ప్రభుదేవా.  మూడో భాగాన్ని  చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేస్తున్నారు ప్రభుదేవా. అందుకే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం కన్నడ నటుడు సుదీప్‌ను తీసుకోవాలనుకుంటున్నారట.

సుదీప్‌కు బాలీవుడ్‌లో యాక్ట్‌ చేయడం కొత్తేమీ కాదు. ఆల్రెడీ రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన ‘ఫూంక్‌’తో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు సుదీప్‌. ఆ తర్వాత ‘ఫూంక్‌ 2, రక్త చరిత్ర’ సినిమాలతో బాలీవుడ్‌ ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు ‘దబాంగ్‌ 3’తో బాలీవుడ్‌ ఆడియన్స్‌కు మరోసారి హాయ్‌ చెప్పనున్నారీ కన్నడ స్టార్‌ హీరో.  ఇందులో సుదీప్‌ది విలన్‌ క్యారెక్టర్‌ అని సమాచారం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top