అతిథిగా లక్కీ నాయకి | Sakshi
Sakshi News home page

అతిథిగా లక్కీ నాయకి

Published Fri, Jul 1 2016 1:32 AM

అతిథిగా లక్కీ నాయకి

 సినిమాల్లో హిట్ పెయిర్‌గా కొందరు ముద్ర పడతారు. అలా పేరు తెచ్చుకున్న జంటల్లో శివకార్తికేయన్, శ్రీదివ్య ఒకరు. వీరిద్దరి కెరీర్‌ను అనూహ్యంగా పెంచేసిన చిత్రం వరుత్తపడాదవాలిభర్ సంఘం. అదే విధంగా ఈ జంట కలిసి నటించిన మరో చిత్రం కాక్కీసట్టై. ఇదీ మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. దీంతో  శివకార్తికేయన్, శ్రీదివ్య హిట్ పెయిర్‌గా ముద్ర పడింది. తాజాగా శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం రెమో. ఇందులో ఆయనకు జంటగా నటి కీర్తీసురేశ్ నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మ కూడా ఇంతకు ముందు రజనీమురుగన్ చిత్రంలో శివకార్తీకేయన్‌తో జత కట్టారన్నది గమనార్హం.
 
 రెమో చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ చిత్రం టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇటీవలే చిత్ర నిర్మాత డి.రాజా గ్రాండ్‌గా నిర్వహించి చిత్ర హైప్‌ను ఇంకా పెంచేశారు. ఇందులో శివకార్తికేయన్, లక్కీ హీరోయిన్ శ్రీదివ్య అతిథిగా దర్శనమీయనున్నారన్నది కోలీవుడ్ వర్గాల తాజా సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సన్నివేశాలు ఇటీవలే చిత్రీకరించినట్లు తెలిసింది. ఇందుతో శివకార్తికేయన్ అందమైన అమ్మాయిగా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే.
 
 దర్శకుడు కేఎస్.రవికుమార్ చిత్రంలోనూ దర్శకుడిగానే నటిస్తున్నారు. దీంతో ఇదేదో సినిమా నేపథ్యంలో సాగే చిత్రం అనిపిస్తోంది కదూ. ఈ విషయాలన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. రెమో చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా భాగ్యరాజ్‌కన్నన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 

Advertisement
Advertisement