
బ్రహ్మోత్సవం లాంటి భారీ డిజాస్టర్ తరువాత శ్రీకాంత్ అడ్డాల పరిస్థితి అయోమయంగా మారింది. ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకు మరో సినిమాను ప్రకంటించారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో కొత్త సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఈ సినిమాకు ఇద్దరు యువహీరోలను తీసుకోవాలనుకున్న శ్రీకాంత్, మెయిన్ హీరోగా శర్వానంద్‌ను తీసుకోగా, మరో హీరో కోసం శ్రీవిష్ణును ఎంపిక చేశారు. శ్రీవిష్ణు వరుస సక్సెస్‌లతో దూకుడుమీదున్నారు. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ సినిమాలతో సోలో హీరోగా సక్సెస్ సాధిస్తూనే.. ఉన్నది ఒకటే జిందగీ, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి మల్టీ స్టారర్ సినిమాతోనూ ఆకట్టుకుంటున్నాడు. మరి ఫుల్ ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు యువ హీరోలతో శ్రీకాంత్ అడ్డాల ఎలాంటి సినిమాను తెరకెక్కిస్తారో వేచి చూడాలి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తుంది.