శిరీష్ డైరెక్టర్తో శర్వానంద్ | Sharwanand Fixed as Hero For for Geetha Arts Parasuram project | Sakshi
Sakshi News home page

శిరీష్ డైరెక్టర్తో శర్వానంద్

Aug 11 2016 12:36 PM | Updated on Sep 4 2017 8:52 AM

శిరీష్ డైరెక్టర్తో శర్వానంద్

శిరీష్ డైరెక్టర్తో శర్వానంద్

గౌరవం, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అల్లు వారబ్బాయి శిరీష్, తొలిసారిగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్కు...

గౌరవం, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అల్లు వారబ్బాయి శిరీష్, తొలిసారిగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్కు సక్సెస్ అందించిన దర్శకుడు పరశురాంతో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తమ బ్యానర్కు మంచి హిట్ అందించిన పరశురాంతో మరో సినిమా నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.

ఈ సినిమాను శర్వానంద్ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే శర్వానంద్కు కథ వినిపించిన పరశురాం.. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు . అయితే శర్వా మాత్రం ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాలు పూర్తయిన తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో శర్వా, పరశురాంల సినిమా క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement