పద్మావతికి హీరో ఫిక్స్ | Shahid as Deepika husband in Bhansalis Padmavati | Sakshi
Sakshi News home page

పద్మావతికి హీరో ఫిక్స్

Sep 10 2016 1:27 PM | Updated on Sep 4 2017 12:58 PM

పద్మావతికి హీరో ఫిక్స్

పద్మావతికి హీరో ఫిక్స్

బాజీరావ్ మస్తానీ సినిమాతో ఆకట్టుకున్న సంజయ్ లీలా బన్సాలీ మరో విజువల్ వండర్ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. పద్మావతి పేరుతో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియంటెడ్ హిస్టారిక్ సినిమాలో...

బాజీరావ్ మస్తానీ సినిమాతో ఆకట్టుకున్న సంజయ్ లీలా బన్సాలీ మరో విజువల్ వండర్ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. పద్మావతి పేరుతో తెరకెక్కుతున్న ఈ లేడీ ఓరియంటెడ్ హిస్టారిక్ సినిమాలో బన్సాలీ లక్కీ హీరోయిన్ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అయితే సినిమా ఎనౌన్స్ చేసి చాలా కాలం అవుతున్నా.. హీరో పాత్రల ఎంపికలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు.

ఇద్దరు హీరోలు నటించనున్న ఈ సినిమాలో ఒక పాత్రకు రణవీర్ సింగ్ను తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. పద్మావతి భర్తగా కనిపించనున్న మరో కీలకపాత్రను బాలీవుడ్ బాద్షా షారూఖ్తో చేయించాలని భావించినా.. అది వర్క్ అవుట్ కాకపోవటంతో యంగ్ హీరో షాహిద్ కపూర్తో సరిపెట్టుకుంటున్నాడట. ప్రస్తుతానికి చర్చల దశలోనే ఉన్నా ఇదే ఫైనల్ కాస్ట్ అన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబందించిన మరిన్ని విశేషాలను ప్రకటించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement