షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు | Shah Rukh Khan To Get Yash Chopra Memorial Award | Sakshi
Sakshi News home page

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు

Dec 29 2016 11:43 PM | Updated on Apr 3 2019 6:34 PM

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు - Sakshi

షారుఖ్‌కు యశ్‌చోప్రా అవార్డు

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ‘యశ్‌ చోప్రా నేషనల్‌ మెమోరియల్‌ అవార్డు’కు ఎంపికయ్యారు. ‘టి. సుబ్బరామిరెడ్డి (టి.ఎస్‌.ఆర్‌) ఫౌండేషన్‌’ ద్వారా ప్రముఖ సినీ నిర్మాత

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ‘యశ్‌ చోప్రా నేషనల్‌ మెమోరియల్‌ అవార్డు’కు ఎంపికయ్యారు. ‘టి. సుబ్బరామిరెడ్డి (టి.ఎస్‌.ఆర్‌) ఫౌండేషన్‌’ ద్వారా ప్రముఖ సినీ నిర్మాత – రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డి గత మూడేళ్లుగా ప్రతి ఏటా ఒకరికి ఈ అవార్డు అందిస్తున్నారు. ఈ ఏడాది షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును ఇచ్చేందుకు సుబ్బరామిరెడ్డి, యశ్‌చోప్రా సతీమణి పమేలా చోప్రా, పద్మినీ కొల్హాపురి, బోనీ కపూర్‌ నిర్ణయించారు. లతా మంగేష్కర్, అమితాబ్‌ బచ్చన్, రేఖలకు గతంలో ఈ అవార్డును ఇచ్చారు. రానున్న ఫిబ్రవరి 25న ముంబయ్‌లో అమితాబ్, ఆమిర్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, శ్రీదేవి తదితరులు పాల్గొనగా, భారీయెత్తున జరిగే ఒక కార్యక్రమంలో షారుఖ్‌ఖాన్‌కు ఈ అవార్డును అందించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement