సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్ | Sakshi
Sakshi News home page

సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్

Published Sun, Nov 10 2013 9:19 PM

సిసలైన బెంగాలీ అనిపించుకుంటా: షారూఖ్

కోల్కతా: తాను సిసలైన బెంగాలీ అనిపించుకుంటానని బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ అన్నారు. జయా బచ్చన్ నుంచి బెంగాలీ నేర్చుకుంటానని తెలిపారు. 19వ కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవం(కేఐఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవానికి షారూఖ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను ఆదరించినందుకు బెంగాలీ వాసులకు ధన్యావాదాలు తెలిపారు.

'నన్ను మీ వాడిగా అక్కున చేర్చుకున్నందుకు కృతజ్ఞతలు. గత మూడేళ్లుగా కేఐఎఫ్ఎఫ్కు హాజరవుతున్నాను. మరోసారి మీ ముందు వచ్చేటప్పకి తప్పకుండా బెంగాలీలో మాట్లాడతాను. జయా బచ్చన్ దగ్గర బెంగాలీ నేర్చుకుని సిసలైన బెంగాలీ పౌరుడిగా మీ ముందు ఉంటా' అని షారూఖ్ అన్నారు. పశ్చిమ బెంగాల్కు షారూఖ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. జయా బచ్చన్ అంతకుముందు ప్రారంభోపన్యాసం చేస్తూ తన భర్త అమితాబ్, షారూఖ్, కమల్ హాసన్లను సిసలైన బెంగాలీలు కాదని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement