రాజమౌళి బాటలో షారూఖ్..! | Shah Rukh Khan revealed that planning to make Mahabharata | Sakshi
Sakshi News home page

రాజమౌళి బాటలో షారూఖ్..!

Apr 12 2017 12:34 PM | Updated on Jul 14 2019 4:05 PM

రాజమౌళి బాటలో షారూఖ్..! - Sakshi

రాజమౌళి బాటలో షారూఖ్..!

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి, త్వరలో మహాభారతాన్ని మరింత భారీగా వెండితెర

బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన దర్శకధీరుడు రాజమౌళి, త్వరలో మహాభారతాన్ని మరింత భారీగా వెండితెర మీద ఆవిష్కరించాలనుందని తెలిపాడు. అయితే ఇంతటి భారీ కథను తెరకెక్కించడానికి తన అనుభవం సరిపోదన్న జక్కన ఎప్పటికైనా మహాభారతాన్ని తెరకెక్కిస్తానని ప్రకటించాడు. అయితే రాజమౌళి ఈ ఆలోచనలో ఉండగానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారతాన్ని తెరకెక్కిస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆరు వంద కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తాజాగా మరో హీరో కూడా మహాభారతాన్ని తెరకెక్కించాలని ఉందని ప్రకంటించాడు. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ మహాభారతాన్ని వెండితెరకెక్కించటం నా కల అని ప్రకటించాడు. 'నేను చాలా ఏళ్లుగా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.. కానీ అంత బడ్జెట్ కేటాయించటం నా వల్ల అవుతుందని నేను అనుకోవటం లేదు. అందుకే ఏదైన హాలీవుడ్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను ముందుకు తీసుకెళ్లుందుకు ప్రయత్నిస్తున్నా.

జనవరిలో మహాభారతం తెరకెక్కించటం పై స్పందించిన రాజమౌళి, తనకు ఆలోచన ఉన్నా వెంటనే అదే సినిమా చేసే అవకాశం లేదని తెలిపాడు. షారూఖ్ కూడా మహాభారతం తెరకెక్కించాలన్న కోరిక ఉందని చెప్పినా.. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. అందులో షారూఖ్ ఏ పాత్రలో కనిపించనున్నాడు లాంటి అంశాలను మాత్రం ప్రస్థావించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement