మ్యాచ్‌ కుదిరిందా?

Shah Rukh Khan planning the remake of Tamil film Mersal - Sakshi

షారుక్‌ ఖాన్‌ తమిళ సినిమాలో కనిపించబోతున్నారా? కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీ సర్కిల్లో ఇదే చర్చ. విజయ్‌ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో షారుక్‌ కనిపిస్తారని టాక్‌. మరోవైపు తమిళ బ్లాక్‌బస్టర్‌ ‘మెర్సల్‌’ను హిందీ రీమేక్‌ చేసే ఆలోచనలో షారుక్‌ ఉన్నారని టాక్‌. మంగళవారం చెన్నై – కోల్‌కత్తా ఐపీఎల్‌ మ్యాచ్‌లో షారుక్‌తో పాటు దర్శకుడు అట్లీ కూడా స్టేడియంలో కనిపించడంతో అట్లీ నెక్ట్స్‌  సినిమాలో షారుక్‌ కనిపిస్తారనే వాదనకు బలం చేకూరింది. మ్యాచ్‌ అనంతరం అట్లీ ఆఫీస్‌కి షారుక్‌ ఖాన్‌ వెళ్లారు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. మరి ఈ చర్చలు విజయ్‌ సినిమాలో షారుక్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించడానికా? లేక ‘మెర్సల్‌’ రీమేక్‌ కోసమా? తెలియాల్సి ఉంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top