'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి! | send back to me my home, asks sampoornesh babu | Sakshi
Sakshi News home page

'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి!

Jul 23 2017 2:56 PM | Updated on Jun 18 2018 8:04 PM

'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి! - Sakshi

'బిగ్ బాస్' నుంచి నన్ను ఎలిమినేట్ చేయండి!

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’ షో ఏడో ఎపిసోడ్‌లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది.

హైదరాబాద్‌: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్’  షో ఏడో ఎపిసోడ్‌లో ఊహించని సన్నివేశం చోటుచేసుకుంది. తెలుగులో తొలి రియాల్టీ షోగా ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న 'బిగ్ బాస్' షో హౌస్ నుంచి తనను పంపంచి వేయాలని నటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు (నరసింహాచారి) కోరడం ఆయన అభిమానులతో పాటు ప్రేక్షకులను అశ్చర్యానికి గురిచేసింది. షోలో తొలి నాలుగు రోజులు కెప్టెన్‌గా వ్యవహరించిన సంపూ తగిన రీతిలో ఆకట్టుకోకపోవడం, సభ్యులను నియంత్రించడంలో విఫలమవడం.. అధిక సమయం నిద్రకు కేటాయించారన్న కారణాలతో బిగ్ బాస్ ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన మరుసటి రెండు రోజుల్లో సంపూర్ణేష్ పూర్తిగా డీలాపడిపోయారు. కాస్త ఒత్తిడికి గురవడంతో ఏకంగా కంటతడి పెట్టుకున్నారు. ఓసారి ఛాతీలో కాస్త నొప్పిగా ఉందని తోటి సభ్యులకు చెప్పారు. మెడిసిన్ల వాడకంతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఆందోళన చెందారు. దీంతో 'బిగ్ బాస్'గారు నన్ను ఇంటికి పంపించండి. అందుకు నేను సిద్ధంగా ఉన్నానంటూ విజ్ఞప్తి చేశారు. షోలో మరో సభ్యుడు ధన్‌రాజ్ చొరవ తీసుకుని సంపూర్ణేష్‌కు ధైర్యం చెప్పారు. టెన్షన్ పడవద్దని, అంతా మంచి జరుగుతుందని నచ్చజెప్పారు. ఒకవేశ నిజంగానే ఇంటికి వెళ్లాలని ఉంటే మాత్రం మరుసటి వారం అందరితో చెప్పి ఎలిమినేషన్‌లో సంపూ పేరు వచ్చేలా చేస్తామన్నారు. తగిన వైద్య సౌకర్యాలు కల్పిస్తామని సంపూర్ణేష్‌కు 'బిగ్ బాస్' హామీ ఇవ్వడంతో ఆయన కాస్త కంట్రోల్ అయ్యారు.

సంబంధిత కథనాలు

'బిగ్‌ బాస్‌'లో నటుడు సంచలన వ్యాఖ్యలు

బిగ్‌ బాస్‌ షోలో సంపూర్ణేష్‌కు షాక్..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement