మూడోదీ హిట్టే! | Sampurnesh Babu's virus movie hit | Sakshi
Sakshi News home page

మూడోదీ హిట్టే!

May 21 2017 11:57 PM | Updated on Sep 5 2017 11:40 AM

మూడోదీ హిట్టే!

మూడోదీ హిట్టే!

‘‘చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తున్నా. అందుకు కారణం స్టార్‌ హీరోల అభిమానులే

‘‘చిత్ర పరిశ్రమలోకి రాక ముందు ప్రేక్షకుల్లో ఒకడిగా ఉండేవాణ్ణి. ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తున్నా. అందుకు కారణం స్టార్‌ హీరోల అభిమానులే. వాళ్లు నన్ను ఆదరించారు’’ అని హీరో సంపూర్ణేష్‌ బాబు అన్నారు. సంపూర్ణేష్‌ బాబు హీరోగా, విదిశా రెడ్డి, దీక్ష హీరోయిన్లుగా ఎస్‌.ఆర్‌. కృష్ణ దర్శకత్వంలో పుల్లరేవు రామచంద్రా రెడ్డి సమర్పణలో సలీమ్, శ్రీనివాస్‌ వంగ నిర్మించిన చిత్రం ‘వైరస్‌’. మీనాక్షి భుజంగ్‌ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నిర్మాత మల్కాపురం శివకుమార్‌ ఆవిష్కరించారు.

సంపూర్ణేష్‌ మాట్లాడుతూ–‘‘నా మొదటి సినిమా ‘హృదయ కాలేయం’, రెండో సినిమా ‘సింగం 123’ నాకు మంచి పేరు తెచ్చాయి. నేను చేసిన మూడో సినిమా ‘వైరస్‌’ కూడా హిట్టవుతుందనే నమ్మకం ఉంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఇందులో ఉంటాయి. ‘వెన్నెల’ కిశోర్‌ చేసిన విలన్‌ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమా బాగా రావడానికి కారణం నిర్మాతలే. సంపూర్ణేష్‌ సహకారం మరువలేనిది’’ అని కృష్ణ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement