నేనెవరికీ భయపడను!: సమంత | Samantha Special Interview About Abhimanyu Movie | Sakshi
Sakshi News home page

నేనెవరికీ భయపడను!

May 25 2018 9:16 AM | Updated on Aug 29 2018 5:43 PM

Samantha Special Interview About Abhimanyu Movie - Sakshi

తమిళసినిమా: చాలా ధైర్యం గల కథానాయికిల్లో నటి సమంత ఒకరని చెప్పవచ్చు. తనకుంటూ కచ్చితమైన అభిప్రాయాలు కలిగిన ఈ సుందరి తన మనసులోని భావాలను నిర్భయంగా వెల్ల డించగలరు. నట జీవితం, ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత జీవితాలను గెలుపు బాటలో సాగించుకుంటున్న అరుదైన నటి సమంత అని చెప్పవచ్చు. సాధారణంగా నటి వివాహనంతరం విజయవంతమైన కథానాయకిగా రాణించడం అరుదే. సమంత దాన్ని సులభంగా బ్రేక్‌ చేసి వరుసగా విజయాలను అందుకుంటున్నారు. ఇటీవల తెలుగు చిత్రం రంగస్థలం, ద్విభాషా చిత్రం నడిగైయార్‌ తిలగం, తమిళ చిత్రం ఇరుంబుతిరై అంటూ వరుస విజయాలను ఎంజాయ్‌ చేస్తున్న సమంత ముచ్చట్లు చూద్దాం.

ప్ర: కోలీవుడ్‌లో విజయ్, సూర్యల తరువాత విశాల్‌తో ఇరుంబుతిరై చిత్రంలో నటించిన అనుభవం గురించి?
జ: విశాల్‌ సెట్‌లో ఉంటే యమ జాలీనే. అందరినీ ఆయన నవ్విస్తుంటారు. చిత్ర పరిశ్రమ, ప్రజలు బాగుండాలని భావించే వ్యక్తి. ఈ వయసులోనే పెద్ద బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడం ఆశ్చర్యమైన విషయం. విశాల్‌ చాలా ప్రతిభావంతుడు.

ప్ర: ప్రస్తుతం నటిస్తున్న విజయ్‌సేతుపతి, శివకార్తి కేయన్‌ చిత్రాల గురించి?
జ: శివకార్తికేయన్, దర్శకుడు పొన్‌రామ్‌ల కాంబినేషన్‌ ఎప్పుడూ చాలా సరదాగా ఉంటుంది. ఒక ఊరు ఇతివృత్తంగా రూపొందిన చిత్రంలో నేనెప్పుడూ నటించలేదు. అలాంటి చిత్రం సీమరాజా. చిత్రం అంతా లంగా ఓణితోనే కనిపిస్తాను. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం కోసం సిలంబాట్టం (కర్రసాము) విద్యను నేర్చుకుని నటించడం మంచి అనుభవం. ఇకపోతే విజయ్‌సేతుపతికి జంటగా త్యాగరాజన్‌ కుమారరాజా దర్శకత్వంలో నటిస్తున్న సూపర్‌ డీలక్స్‌ చిత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుందని చెప్పగలను. కొందరు శివకార్తికేయన్, విజయ్‌సేతుపతిల మధ్య పోటీ అంటుంటారు. నిజానికి అలాంటిదేమీ లేదు. వారు ముందు చిత్రాలతోనే పోటీ పడుతుంటారు.

ప్ర: వివాహానంతరం నటించడం గురించి ఎలా భావిస్తున్నారు?
జ: వివాహనంతరం విడుదలైన రంగస్థలం ఘన విజయం సాధించిన చిత్రంగా నిలిచింది. పెళ్లి కారణంగా నాకెలాంటి బాధింపు కలగలేదు. మంచి కథా పాత్రలు, చక్కగా నటించే అవకాశం కలిగితే నన్నెవరూ పక్కన పెట్టలేరు. పెళ్‌లైన నటి అనే ఇమేజ్‌ను బ్రేక్‌ చేయడం ఎంత కష్టం అన్నది తెలుసు. అయితే దాన్ని బ్రేక్‌ చేస్తే చాలదు. వరుసగా పలు విజయవంతమైన చిత్రాలను అందిస్తేనే పెళ్‌లైయిన నటి కథానాయకిగా రాణించగలనని నిరూపించి భవిష్యత్‌లో వచ్చే నటీమణులకు స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను.

ప్ర: పెళ్లి తరువాత సమంతలో మార్చు వచ్చిందా?
జ: నిజం చెప్పాలంటే నాకు కోపం ఎక్కువ. పెళ్ళైన తరువాత అది కొంచెం తగ్గించుకున్నాను. వివాహానంతరం షూటింగ్‌ ముగించుకుని సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికి వెళ్లిపోతాను. ఇంటిలో సినిమా గురించి మాట్లాడకూదని నాగచైతన్య చెప్పారు. అయితే ఆయనతో గొడవ పడతాను. అయితే మా గొడవలు పక్కనున్న వారికి కూడా తెలియవు. అంత సైలెంట్‌గా జాలీగా గొడవ పడుతుంటాం. అది చూసేవారికి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు అనిపిస్తుంది. వివాహం అయిన నటి కూడా సక్సెస్‌ఫుల్‌గా రాణించవచ్చునని నాగచైతన్య నమ్ముతున్నారు. నటన అన్నది ఒక వృత్తిగానే భావించు అని ఆయన చెప్పడం ఉన్నతమైన ఆలోచన.

ప్ర: వివాహానంతరం సామాజిక మాధ్యమాల్లో గ్లామరస్‌ ఫొటోలను విడుదల చేస్తున్నారనే విమర్శలపై మీ స్పందన?
జ: సముద్రతీరంలో ఈత దుస్తుల్లో ఫొటోలను విడుదల చేస్తే నా గురించి కచ్చితంగా విమర్శిస్తారని తెలుసు. అయితే బీచ్‌లో చీరలు ధరించగలమా? నేను వివాహిత నటిననేగా తప్పుగా విమర్శిస్తున్నారు. నా జీవితాన్ని ఎలా గడపాలన్నది ఎవరూ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనెవరికీ భయపడను. ఎలాంటి సమస్యలోనూ చిక్కుకోవాలని కోరుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement