చదువులో నేను టాపర్‌: సమంత

Samantha Akkineni Reveals School Report Card That She Was A Topper - Sakshi

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరైన సమంత అక్కినేని తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోడానికి సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అక్కినేని కోడలుగా మారిన అనంతరం ఆమెకున్న క్రేజ్‌ మరింత పెరిందని చెప్పవచ్చు. ఇటు వ్యక్తిగత విషయాల్లోనూ అటు సినిమాల పరంగానూ పక్కా క్లారిటీతో ఉండే సామ్‌  అన్నింటిలోనూ తను బెస్ట్‌ అని మరోసారి రుజువు చేసుకున్నారు. నటిగా, భార్యగా, కోడలిగా, తనదైన పాత్ర పోషిస్తున్న సమంతా తాజాగా చదువుల్లోనూ టాపర్‌ అని నిరూపించుకుంది. ఈ మేరకు చెన్నైలో చదువుకున్న రోజుల్లో 10,11వ తరగతిలోని తన ప్రోగ్రెస్‌ రిపోర్టును సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. (బుట్ట‌బొమ్మ‌ సారీ చెప్తుందా?)

‘చాలా మంచి మార్కులు సాధించింది. ఆమె పాఠశాలలో చదవడం గొప్ప విషయం’. అని టీచర్‌ మార్కుల ప్రోగ్రెస్‌పై రాసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది. సమంతకు అన్ని మార్కులు రావడంతో అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాము అభిమానించే నటి అన్నింటిలోనూ టాపర్‌ అని మురిసిపోతున్నారు. కాగా చెన్నైలోని పల్లవారంలో జన్మించిన సమంత అక్కినేని తన పదవ తరగతి వరకు  స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూల్లో చదువుకున్నారు. అనంతరం 11, 12 తరగతుల కోసం హోలీ ఏంజిల్స్ ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చేరారు. ఇక లాక్‌డౌన్‌లో  తన కలలను నెరవేర్చుకునే బాట పట్టారు సమంత. ఈ ‍క్రమంలో భర్తతో, తన పెంపుడు కుక్క హాష్‌తో బిజీగా గడుపుతున్నారు. (నా భర్త ఎక్కడో గొయ్యి తవ్వుతున్నాడు : సమంత)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top