‘దబాంగ్‌-3’తో నటుడి కుమార్తె తెరంగ్రేటం

Salman Khan Introduces Saiee Manjrekar With Dabangg3 Poster - Sakshi

ముంబై: బాలీవుడ్‌ హీరో, కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ తాజా చిత్రం ‘దబాంగ్‌-3’తో సీనియర్‌ నటుడు, సినీ నిర్మాత మహేష్‌ మంజ్రేకర్‌ ముద్దుల తనయ సాయి ఎం మంజ్రేకర్‌ వెండితెరకు పరిచయం అవుతోంది. ఈ విషయాన్ని సల్మాన్‌ ఖాన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. సల్మాన్‌ మంగళవారం ట్విటర్‌లో రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో నటి సాయి మంజ్రేకర్‌ను పరిచయం చేస్తూ.. 'ఎటువంటి మాలిన్యం లేని స్వచ్ఛమైన మా అమాయకపు చిన్నారి ఖుషీ' అనే వ్యాఖ్యలు జోడించారు. దబాంగ్‌-3లో ప్రధాన పాత్రధారులుగా ఉన్న హీరోయిన్‌ సోనాక్షీ సిన్హాతో పాటు కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ పోస్టర్‌లను ఇప్పటికే రిలీజ్‌ చేశారు. సల్మాన్‌ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తోన్న దబాంగ్‌-3 ట్రైలర్‌ అక్టోబరు 23న బయటకు రానుంది. కాగా ఈ చిత్రం డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top