
లైట్స్ ఆన్.. స్టార్ట్ కెమెరా.. యాక్షన్.. కట్... ప్రతి డైరెక్టరూ షూటింగ్ స్పాట్‌లో సీన్ తీయడానికి ఇలానే అంటారు. దర్శకుడు ఇలా యాక్షన్ చెప్పగానే... కెమెరా ముందు నటించేవారు సాయిరామ్ శంకర్... బ్రదర్ ఆఫ్ పూరి జగన్నాథ్. అన్నయ్య డైరెక్షన్‌లోనూ ఆయన నటించారు. ఇప్పుడు అన్నయ్య రూట్‌లో డైరెక్టర్ కాబోతున్నారని టాక్. డైరెక్టర్‌గా మారుతున్నారంటేనటుడిగా కొనసాగరేమో అనుకుంటున్నారా? అదేం లేదు. ఎందుకంటే తాను డైరెక్ట్ చేయనున్న సినిమాలో హీరో కూడా తానే.
మామూలుగా పూరి జగన్నాథ్ తన సినిమాలకు తానే కథ రాసుకుంటారు. సాయిరామ్ శంకర్ కూడా అదే ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం కథ రెడీ చేసే పని మీద ఉన్నారట. ఇది లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని సమాచారం. దర్శకుడిగా పూరి ఫుల్ సక్సెస్. తమ్ముడు కూడా సక్సెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.