అటు లవ్‌... ఇటు ఫైట్‌ | sai dhram tej new movie started | Sakshi
Sakshi News home page

అటు లవ్‌... ఇటు ఫైట్‌

Dec 15 2017 12:18 AM | Updated on Dec 15 2017 12:18 AM

sai dhram tej new movie started - Sakshi

సాయిధరమ్‌ తేజ్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై కరుణాకరన్‌ దర్శకత్వంలో కేయస్‌ రామారావు ఓ చిత్రం నిర్మిస్తోన్న విషయం తెలిసిందే. చక్కని ప్రేమకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒకవైపు ఈ ప్రేమకథలో నటిస్తోన్న సాయిధరమ్‌ మరోవైపు ఓ యాక్షన్‌ మూవీలో నటించడం విశేషం. సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వీవీ వినాయక్‌ దర్శకత్వంలో ఈ యాక్షన్‌ మూవీ తెరకెక్కుతోంది.

ఈ సినిమాకి  ఫస్ట్‌ ‘ఇంటెలిజెంట్‌’ అని టైటిల్‌ అనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ‘ధర్మాభాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలనుకుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌.  ఈ చిత్రం కోసం యాక్షన్‌ సీన్స్‌ తెరకెక్కిస్తున్నారట. ఇందులో తేజ్‌ సాఫ్ట్‌వేర్‌ కుర్రాడిగా నటిస్తున్నారట. అటు లవ్‌.. ఇటు యాక్షన్‌ మూవీస్‌లో నటిస్తూ సాయిధరమ్‌ ఫుల్‌ బిజీ. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement