17న తెరపైకి రమ్‌ | Rum movie release on 17th | Sakshi
Sakshi News home page

17న తెరపైకి రమ్‌

Feb 15 2017 2:22 AM | Updated on Sep 5 2017 3:43 AM

17న తెరపైకి రమ్‌

17న తెరపైకి రమ్‌

ఆల్‌ ఇన్ పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్‌.

ఆల్‌ ఇన్  పిక్చర్స్‌ పతాకంపై నిర్మాత టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్‌. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. నవ దర్శకుడు ఎం.సాయిభరత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృషికేష్‌ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి సంజనాశెట్టి, మియాజార్జ్‌ కథానాయికలుగా నటించారు. ప్రధాన పాత్రలో వివేక్, ముఖ్య పాత్రల్లో అంజద్, అర్జున్ టించగా ప్రతినాయకుడిగా నరేన్  నటించారు. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం అనిరుద్‌ సంగీతబాణీలు కట్టడం విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రమ్‌ చిత్ర విడుదల హక్కుల్ని పొందిన శ్రీసాయి సర్క్యూట్‌ 6000 సంస్థ ఈ నెల 17న విడుదల చేయనుంది.

ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్‌ విలేకరుల సమావేశం నిర్వహంచారు.ఆ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిభరత్‌ మాట్లాడుతూ రెండు–మూడేళ్లుగా తయారు చేసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రం రమ్‌ అని తెలిపారు. కథను విన్న నటుడు హృషికేష్‌ చాలా బాగుందని వెంటనే హీరోగా నటించడానికి అంగీకరించారన్నారు. ఆ తరువాత నిర్మాత విజయరాఘవేంద్ర చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారన్నారు. ఆపై నటి సంచితశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్  ఇలా అందరూ పాత్రలకు తగ్గట్టు కుదిరారని చెప్పారు.రమ్‌ హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రం అయినా, ఆ తరహా చిత్రాలకు ఢిపరెంట్‌గా యాక్షన్  థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు.

ఒక రాబరీతో మొదలయ్యే ఈ కథ హారర్‌గా ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగానూ, థ్రిల్లింగ్‌గానూ సాగుతుందని చెప్పారు. యువత, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్‌ చేసేలా రమ్‌ ఉంటుందని అన్నారు. రమ్‌ అన్నది తమిళ పదమేనని, దీనికి నీతి అనే అర్థం అని తెలిపారు. చిత్ర కథానాయకుడు హృషికేశ్‌ మాట్లాడుతూ అనిరుద్‌ సంగీతాన్ని అందించడం రమ్‌ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా పేర్కొన్నారు.ఇక వివేక్‌ లాంటి ప్రముఖ నటుడు కొత్త వాళ్లు చేసిన చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆయన పాత్ర హస్యం దాటి చిత్రం అంతా ట్రావెల్‌ అవుతుందని తెలిపారు.రమ్‌ చిత్రాన్ని దర్శకుడు సాయిభరత్‌ చాలా బాగా హ్యాండిల్‌ చేశారని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్‌ అని నటి సంచితాశెట్టి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement