breaking news
Sanjana Shetty
-
రైలెక్కి చెక్కేస్తా...
శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ పతాకంపై బేబి ఢమరి సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘ఎర్రచీర’. సి.హెచ్ సుమన్‌బాబు స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన హారర్ చిత్రం ఇది. ఈ చిత్రంలోని ‘రైలెక్కి చెక్కేస్తా...’ అనే ఐటెమ్ సాంగ్‌ను దర్శకుడు బాబీ, నటుడు సత్యప్రకాశ్ విడుదల చేశారు. ‘ఎర్రచీర’ చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్‌ను రామసత్యనారాయణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాబీ మాట్లాడుతూ– ‘‘ఐటెమ్ సాంగ్ బావుంది. సుమన్ గారు దర్శకునిగా, నిర్మాతగా రెండు బాధ్యతలు నిర్వర్తించటం చాలా గొప్ప విషయం. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా దర్శకుడు బాబీ మా సినిమాను ఆశీర్వదించటానికి వచ్చారు. కొన్ని కారణాల వల్ల ఢమరి అనే సొంత మ్యూజిక్ కంపెనీని స్టార్ట్ చేశాను. శ్రీకాంత్‌గారు ఇంతకుముందు ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో నటించారు. డిసెంబర్ 27న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ‘‘ఇందులో మంచి పాత్ర చేశా’’ అన్నారు హీరోయిన్ సంజనా శెట్టి. సినిమాలో ఓ కీలక పాత్ర చేసిన సురేష్ కొండేటి, మాజీమంత్రి పుష్పలీల, సంగీత దర్శకుడు ప్రమోద్, రచయిత గోపి తదితరులు పాల్గొన్నారు. -
17న తెరపైకి రమ్
ఆల్ ఇన్ పిక్చర్స్ పతాకంపై నిర్మాత టీ.విజయరాఘవేంద్ర నిర్మించిన చిత్రం రమ్. ఈ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. నవ దర్శకుడు ఎం.సాయిభరత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హృషికేష్ కథానాయకుడిగా నటించిన ఇందులో నటి సంజనాశెట్టి, మియాజార్జ్ కథానాయికలుగా నటించారు. ప్రధాన పాత్రలో వివేక్, ముఖ్య పాత్రల్లో అంజద్, అర్జున్ టించగా ప్రతినాయకుడిగా నరేన్ నటించారు. ఈ చిత్రానికి యువ సంగీత తరంగం అనిరుద్ సంగీతబాణీలు కట్టడం విశేషం. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రమ్ చిత్ర విడుదల హక్కుల్ని పొందిన శ్రీసాయి సర్క్యూట్ 6000 సంస్థ ఈ నెల 17న విడుదల చేయనుంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం నిర్వహంచారు.ఆ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిభరత్ మాట్లాడుతూ రెండు–మూడేళ్లుగా తయారు చేసుకున్న కథతో తెరకెక్కించిన చిత్రం రమ్ అని తెలిపారు. కథను విన్న నటుడు హృషికేష్ చాలా బాగుందని వెంటనే హీరోగా నటించడానికి అంగీకరించారన్నారు. ఆ తరువాత నిర్మాత విజయరాఘవేంద్ర చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చారన్నారు. ఆపై నటి సంచితశెట్టి, మియాజార్జ్, వివేక్, నరేన్ ఇలా అందరూ పాత్రలకు తగ్గట్టు కుదిరారని చెప్పారు.రమ్ హారర్ నేపథ్యంలో సాగే చిత్రం అయినా, ఆ తరహా చిత్రాలకు ఢిపరెంట్‌గా యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని తెలిపారు. ఒక రాబరీతో మొదలయ్యే ఈ కథ హారర్‌గా ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగానూ, థ్రిల్లింగ్‌గానూ సాగుతుందని చెప్పారు. యువత, పెద్దలు అందరూ చూసి ఎంజాయ్ చేసేలా రమ్ ఉంటుందని అన్నారు. రమ్ అన్నది తమిళ పదమేనని, దీనికి నీతి అనే అర్థం అని తెలిపారు. చిత్ర కథానాయకుడు హృషికేశ్ మాట్లాడుతూ అనిరుద్ సంగీతాన్ని అందించడం రమ్ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌గా పేర్కొన్నారు.ఇక వివేక్ లాంటి ప్రముఖ నటుడు కొత్త వాళ్లు చేసిన చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఆయన పాత్ర హస్యం దాటి చిత్రం అంతా ట్రావెల్ అవుతుందని తెలిపారు.రమ్ చిత్రాన్ని దర్శకుడు సాయిభరత్ చాలా బాగా హ్యాండిల్ చేశారని అన్నారు. ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని నటి సంచితాశెట్టి పేర్కొన్నారు.