చాలా రోజుల తర్వాత పాట పాడా | rp patnaik releases pranavam movie second song | Sakshi
Sakshi News home page

చాలా రోజుల తర్వాత పాట పాడా

Feb 17 2019 2:56 AM | Updated on Feb 17 2019 2:56 AM

rp patnaik releases pranavam movie second song - Sakshi

ఆర్పీ పట్నాయక్, శ్రీ

‘‘చాలా రోజుల విరామం తర్వాత ‘ప్రణవం’ చిత్రంలో ఒక మంచి మెలోడీ సాంగ్‌ పాడాను. ఈ పాట శ్రోతలకు నచ్చుతుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు’’ అని సంగీత దర్శకుడు ఆర్‌.పి. పట్నాయక్‌ అన్నారు. ‘ఈ రోజుల్లో’ శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్‌ ముఖ్య తారలుగా కుమార్‌ జి. దర్శత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రణవం’. చరిత అండ్‌ గౌతమ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై తను. ఎస్‌ నిర్మించారు. పద్మారావ్‌ భరద్వాజ్‌ స్వరపరచిన ఈ సినిమాలోని రెండవపాటను ఆర్‌.పి. పట్నాయక్‌ విడుదల చేశారు.

ఈ పాటను ఆర్‌.పి.పట్నాయక్, ఉష కలిసి పాడటం విశేషం.  హీరో శ్రీ మంగం మాట్లాడుతూ– ‘‘సరికొత్త కథాంశంతో తెరకెక్కిన చిత్రమిది. మార్చిలో సినిమాని రిలీజ్‌ చేయడానికి నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారు. ఆర్పీగారు పాడిన పాట అందరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం’’ అన్నారు. ‘‘ఇటీవల మా చిత్రంలోని తొలిపాటను విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది’’ అని పద్మారావ్‌ భరద్వాజ్‌ అన్నారు. పాటల రచయిత కరుణ కుమార్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మార్గల్‌ డేవిడ్, సహ నిర్మాతలు: వైశాలి, అనుదీప్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement