కేసు విషయంపై స్పందించిన రవీనా టండన్‌ | Raveena Tandon Clarifies After Case Filed Against To her | Sakshi
Sakshi News home page

తనపై నమోదైన కేసుపై స్పందించిన రవీనా టండన్‌

Dec 27 2019 10:12 AM | Updated on Dec 27 2019 10:14 AM

Raveena Tandon Clarifies After Case Filed Against To her - Sakshi

బాలీవుడ్‌ నటి రవీనా టండన్‌ తన మీద నమోదు అయిన కేసు విషయంపై శుక్రవారం స్పందించారు. క్రిస్మస్‌ సందర్భంగా టెలివిజన్‌లోని షోకు హాజరైన రవీనా టంబన్‌ క్రైస్తవ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యానించిందని క్రిస్టియన్ ఫ్రంట్ అజ్నాలా బ్లాక్ అధ్యక్షుడు సోను జాఫర్ బుధవారం అజ్నాలా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అమృత్‌సర్‌ పోలీసులు రవీనా టండన్‌తోపాటు కొరియోగ్రాఫర్‌ ఫరాఖాన్‌, కమెడియన్‌ భారతి సింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన నమోదు చేశారు.

తాజాగా ఈ కేసుపై స్పందించిన రవీనా ఎవరినీ అవమానించడం తన ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ..‘నేను ఎవరినీ కించపరచాలని అనుకోలేదు. ఏ మతాన్ని తక్కువ చేసి, అవమానించినట్లుగా మాట్లాడలేదు. ఒకవేళ ఎవరైనా నావల్ల బాధపడితే మనస్పూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. ప్లీజ్‌ ఈ వీడియోని చూడండి’  అని టెలివిజన్‌ షోలో ప్రసారమైన వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement