శీతాకాలానా... సాగర తీరాన... | Ranveer Singh And Deepika Padukone FINALLY PICK A VENUE For Their Wedding | Sakshi
Sakshi News home page

శీతాకాలానా... సాగర తీరాన...

Jul 31 2018 1:42 AM | Updated on Jul 31 2018 1:43 AM

Ranveer Singh And Deepika Padukone FINALLY PICK A VENUE For Their Wedding - Sakshi

రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకోన్

సముద్ర తీరం.. చుట్టూ విశాలమైన ప్రదేశంలో విల్లాలు. ఏంటి? రొమాంటిక్‌ సాంగ్‌ షూటింగ్‌ జరిపే ప్లేస్‌ గురించి చెబుతున్నాం అనుకుంటున్నారా? కాదు. కానే కాదు. ఇది దీపికా పదుకోన్, రణ్‌వీర్‌ సింగ్‌ పెళ్లి చేసుకోబోయే ప్లేస్‌ గురించి. దీపికా పదుకోన్‌ మెడలో రణ్‌వీర్‌ మూడు ముళ్ళు ఎప్పుడు వేస్తారా? అని ఎదురు చూస్తున్న తేదీ నవంబర్‌ 10 అని ఆల్రెడీ ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. పెళ్లి ఫారిన్‌లో జరుగుతుందనే వార్త వచ్చింది కానీ ప్లేస్‌ ఎక్కడో ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ పెళ్లి మండపం కూడా ఫిక్స్‌ అయిందట. 

ఇటలీలోని లేక్‌ కోమో దగ్గర ఈ జంట ఒక్కటి కాబోతున్నారట. ఆ మధ్య అనుష్కా శర్మ, క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ కూడా ఇటలీలోనే వివాహం చేసుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది. దీపికా, రణ్‌వీర్‌ వివాహానికి కేవలం క్లోజ్‌ ఫ్రెండ్స్‌ సర్కిల్‌ మాత్రమే హాజరు కానున్నారట. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన పనులన్నీ ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. పెళ్లి తర్వాత ముంబైలో ఇండస్ట్రీ మిత్రులందరికీ పెద్ద ఎత్తున రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement