బద్ధశత్రువులంతా కలిసిన వేళ... | ramgopal varma tweets rare photo from sholay movie | Sakshi
Sakshi News home page

బద్ధశత్రువులంతా కలిసిన వేళ...

Aug 12 2016 11:47 AM | Updated on Sep 4 2017 9:00 AM

బద్ధశత్రువులంతా కలిసిన వేళ...

బద్ధశత్రువులంతా కలిసిన వేళ...

వాళ్లంతా బద్ధ శత్రువులు. మొత్తం నలుగురు. వాళ్లలో ఒకరిని చంపడానికి మరొకరు మిగిలిన ఇద్దరిని కిరాయికి పిలిపించుకుంటారు.

వాళ్లంతా బద్ధ శత్రువులు. మొత్తం నలుగురు. వాళ్లలో ఒకరిని చంపడానికి మరొకరు మిగిలిన ఇద్దరిని కిరాయికి పిలిపించుకుంటారు. కానీ నలుగురూ కలిసి భుజాల మీద చేతులు వేసుకుని నవ్వుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది? పైన చెప్పింది షోలే సినిమా స్టోరీ. ఆ తర్వాత చెప్పింది ఆ సినిమా షూటింగ్‌లో సన్నివేశం.

సినిమాలో వీరూ, జై, ఠాకూర్, గబ్బర్ సింగ్ పాత్రలలో నటించిన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమ్జాద్ ఖాన్.. ఈ నలుగురూ షూటింగ్ సమయంలో సరదాగా నవ్వుకుంటూ ఒకళ్ల భుజాల మీద ఒకళ్లు చేతులు వేసుకుని తీయించుకున్న అరుదైన ఫొటోను దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. సాధారణంగా తన ట్వీట్లలో ఎవరో ఒకరిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే రాము.. తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా, బాగా ఇష్టమైన షోలే సినిమాకు సంబంధించిన ఈ ఫొటోను ప్రేక్షకుల కోసం అందించాడు రామూ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement