మార్చితో ముగింపు | Ram Gopal Varma 'Finds A New Actor' In Nagarjuna, His First Hero. | Sakshi
Sakshi News home page

మార్చితో ముగింపు

Feb 17 2018 1:50 AM | Updated on Jul 21 2019 4:48 PM

 Ram Gopal Varma 'Finds A New Actor' In Nagarjuna, His First Hero. - Sakshi

రామ్‌గోపాల్‌ వర్మ సినిమా షూటింగ్‌లను జెట్‌ స్పీడ్‌తో కంప్లీట్‌ చేస్తారు. 24 ఏళ్ల తర్వాత నాగార్జునతో చేస్తున్న యాక్షన్‌ ఫిల్మ్‌ను కూడా అదే స్పీడ్‌లో కంప్లీట్‌ చేస్తున్నారట వర్మ. ఈ సినిమా   షూటింగ్‌ మొత్తం మార్చి ఆఖరికల్లా కంప్లీట్‌ చేయాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ముంబైలో కొన్ని రియలిస్టిక్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఎటువంటి డూప్స్‌ సహాయం లేకుండా ఈ ఫైట్‌ సీన్స్‌లో పాల్గొంటున్నారట నాగార్జున. మార్చి చివరి వరకూ ఈ షెడ్యూల్‌ ముంబైలోనే కొనసాగనుందని సమాచారం.  ‘‘1989 ఫిబ్రవరి 16న ‘శివ’ అనే గేమ్‌ చేంజింగ్‌ ఫిల్మ్‌ను మొదలుపెట్టాం.

మళ్లీ 29 ఏళ్ల తర్వాత రాక్‌ చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు నాగార్జున.అదేంటీ.. పైన 24 ఏళ్లు అన్నారు.. నాగ్‌ ఏమో 29 ఏళ్లు అంటున్నారు అనుకుంటున్నారా? నాగ్‌ చెప్పింది ‘శివ’ గురించి. ఆ తర్వాత వర్మ దర్శకత్వంలో ‘అంతం’, ‘గోవిందా గోవిందా’ వంటి సినిమాలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘25 ఏళ్లుగా వెతికితే ఇప్పటికి నాకు ఓ కొత్త నటుడు దొరికాడు. అతని పేరే నాగార్జున. ఈ సినిమాలో కనీ వినీ ఎరగని రీతిలో రియలిస్టిక్‌ యాక్షన్‌ చేస్తున్నాడీ హీరో’’ అని ఫోటోలను షేర్‌ చేశారు రామ్‌గోపాల్‌ వర్మ. ఈ చిత్రానికి ‘శపథం– మై రివెంజ్‌ కంప్లీట్స్, జడ్జిమెంట్‌’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయటానికి ప్లాన్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement