వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

Ram Gopal Varma Film Amma Rajyamlo Kadapa Biddalu Has Received A Green Signal - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ ఇంకా బతికే ఉందని తెలిసి థ్రిల్ అయ్యాను. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ లైన్ క్లియర్ కాగా.. డిసెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

సారీ సారీ.. అలవాటులో పొరపాటు ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నాం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. తొలుత ఈ సినిమాకు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అన్న టైటిల్ ను నిర్ణయించారు. సినిమా కథనంతోపాటు దీని టైటిల్ ను సవాల్ చేస్తూ..కోర్టులో పలు పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టు ఆదేశాలమేరకు సెన్సార్ బోర్డు సినిమాను చూసి పరిశీలనాంశాలను తెలపాలని కోరిన విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top