మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి | Ram Charan to team up with Arvind Swamy in Mani Ratnam | Sakshi
Sakshi News home page

మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి

May 17 2017 2:49 AM | Updated on Sep 5 2017 11:18 AM

మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి

మణిరత్నంను ఆకట్టుకున్న అతిథి

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో రిపీట్‌ అయిన కథానాయికలు చాలా తక్కువనే చెప్పాలి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ మాత్రమే ఇరువర్,

ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం చిత్రాల్లో రిపీట్‌ అయిన కథానాయికలు చాలా తక్కువనే చెప్పాలి. మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ మాత్రమే ఇరువర్, గురు,రావణన్‌ చిత్రాల్లో నటించారు. తాజాగా మరో బాలీవుడ్‌ నటి అతిథిరావు దర్శకుడు మణిరత్నంను బాగా ఆకట్టకున్నారు. ఈ బ్యూటీని కార్తీకి జంటగా కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం చేశారు.ఆ చిత్రం విడుదలై ఇటు పరిశ్రమ వర్గాలలోనూ, అటు ప్రేక్షకుల్లోనూ మిశ్రమ స్పందనను పొందినా, మణిరత్రం మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన తాజా చిత్రానికి రెడీ అయిపోయారు.

ఈ సారి తమిళం, తెలుగు భాషల్లో చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.  ఇందులో తాను దళపతి చిత్రం ద్వారా పరిచయం చేసి, రోజా, బొంబాయి చిత్రాలతో రొమాంటిక్‌ హీరోగా మార్చిన నటుడు అరవిందస్వామిని తాజా చిత్రంలో కథానాయకుడిగా ఎంచుకున్నట్లు సమాచారం. అదే విధంగా టాలీవుడ్‌ యువ స్టార్‌ నటుడు రామ్‌చరణ్‌ను మరో హీరోగా ఎంపిక చేసినట్లు టాక్‌ హల్‌చల్‌ చేస్తోంది.

ఇక ఈ చిత్రంలో హీరోయిన్‌ పాత్రకు అతిథిరావునే ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం. కాట్రువెలియిడై చిత్రంలో ఈ అమ్మడి అభినయం అంతగా మణిరత్నంకు నచ్చేయడంతో తన తాజా చిత్రంలోనూ ఈ భామనే నాయకిగా ఎంచుకున్నారని టాక్‌. మొత్తం మీద కోలీవుడ్‌లో అతి«థిరావు మరో అవకాశం కొట్టేసిందన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement