చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ | Ram Charan All Set for Instagram Debut | Sakshi
Sakshi News home page

చరణ్‌ ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌

Jul 10 2019 1:13 PM | Updated on Jul 10 2019 1:21 PM

Ram Charan All Set for Instagram Debut - Sakshi

ఈ జనరేషన్‌ స్టార్లు సినిమాల్లో నటించటంతో పాటు అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు కూడా సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ విషయంలో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కాస్త వెనకబడ్డాడనే చెప్పాలి.

ఇతర హీరోలందరూ సోషల్‌ మీడియాలో దూసుకుపోతుంటే చరణ్ మాత్రం ఇంతవరకు ఏ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలోనూ లేడు. తాజాగా తన సోషల్‌ మీడియా ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ చేశాడు చెర్రీ. ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. ఇప్పటికే చరణ్‌ @alwaysramcharan ఐడీతో ఇన్స్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. ఈ అకౌంట్‌ ద్వారా శుక్రవారం (జూలై 12)తొలి పోస్ట్ చేయనున్నాడు చరణ్‌.

చరణ్‌ ఒక్క పోస్ట్ కూడా చేయకుండానే సోషల్ మీడియాలో రికార్డ్స్‌ సృష్టిస్తున్నాడు. అకౌంట్ క్రియేట్ చేసిన 5 గంటల్లోనే దాదాపు 50 వేల మందికి పైగా ఆ అకౌంట్‌కు ఫాలోవర్స్‌ అయ్యారు. 12 గంటల్లోనే లక్షా 30 వేల మందికి పైగా ఫాలోవర్స్‌ అయ్యారు. ఇప్పటికే ఈ అకౌంట్‌ను 2 లక్షల మందికిపైగా ఫాలో అవుతున్నారు. చరణ్‌ తొలి ట్వీట్ చేసిన తరువాత మరిన్ని రికార్డ్‌లు క్రియేట్ చేయటం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్‌. ఇక సినిమాల విషయానికి వస్తే చరణ్ ప్రస్తుతం ఎన్టీఆర్‌ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement