మరోసారి ఫేక్‌న్యూస్‌ బారిన రకుల్‌

Rakul Fire On Fake News Over Refusing To Shoot For Sivakarthikeyan Movie - Sakshi

సౌతిండియన్‌ క్రేజీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి ఫేక్‌ న్యూస్‌ బారిన పడ్డారు. గతంలో మెడికల్‌ షాప్‌కు వెళ్లగా, మద్యం దుకాణానికి వెళ్లినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై చాలా కూల్‌గా సమాధానం ఇచ్చారు రకుల్‌. అయితే ప్రస్తుతం తనపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. తమిళ స్టార్‌ హీరో శివకార్తికేయన్‌, రకుల్‌ జంటగా తమిళంలో ‘అయాలన్‌’ అనే చిత్రం రూపొందుతోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.  కొంత వరకు షూటింగ్‌ జరుపుకున్న ఈ మూవీ లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయింది. (‘అప్ప‌టి నుంచే ఆ అల‌వాటు ఉంది’)

అయితే ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలకు రకుల్‌ ఝలక్‌ ఇచ్చిందని, కరోనా కారణంగా షూటింగ్‌లలో పాల్గొనని చెప్పడంతో ఆమెను చిత్రం నుంచి తప్పించారనే వార్తలు తమిళ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. అయితే ఈ వార్తలపై రకుల్‌ మండిపడ్డారు. 'బాధ్యతాయుతమైన జర్నలిజం మనకు ఎప్పుడు వస్తుంది? వాస్తవాలను చెక్ చేసుకుని రాయడం అన్నది మీడియా ఎప్పుడు ప్రారంభిస్తుంది? నాకూ షూటింగ్ చేయాలనే వుంది. అసలు ఎవరు ఎక్కడ షూటింగులు జరుపుతున్నారో చెప్పండి?' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ వార్తలపై చిత్ర దర్శకుడు రవికుమార్‌ కూడా స్పందించారు. రకుల్‌ను తమ సినిమా నుంచి తీసేశారనే వార్త అవాస్తమని కొట్టిపారేశాడు. (‘నిన్నే పెళ్లాడతా’ సాంగ్‌: మంచు లక్ష్మి ట్వీట్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top