హిందీలో రక్షకభటుడు | rakshaka bhatudu hindi rights sold | Sakshi
Sakshi News home page

హిందీలో రక్షకభటుడు

Mar 23 2017 12:12 AM | Updated on Sep 5 2017 6:48 AM

హిందీలో రక్షకభటుడు

హిందీలో రక్షకభటుడు

కథే హీరో అంటుంటాం. అందుకే స్టార్‌ హీరో నటించారా? మినిమమ్‌ గ్యారంటీ హీరో నటించారా? అనేది పట్టించుకోకుండా కథ విని,

‘‘కథే హీరో అంటుంటాం. అందుకే స్టార్‌ హీరో నటించారా? మినిమమ్‌ గ్యారంటీ హీరో నటించారా? అనేది పట్టించుకోకుండా కథ విని, మా చిత్రం హిందీ అనువాద హక్కులను ఫ్యాన్సీ రేటు ఇచ్చి, కొన్నారు’’ అని నిర్మాత ఎ. గురురాజ్‌ అన్నారు. వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘రక్షకభటుడు’. రిచా పనై, బ్రహ్మానందం, ‘బాహుబలి’ ప్రభాకర్, బ్రహ్మాజీ, సుప్రీత్‌ ముఖ్య తారలు. ఎ. గురురాజ్‌ మాట్లాడుతూ– ‘‘కథే ఈ చిత్రానికి అసలైన హీరో.

దెయ్యాలని దేవుడు శిక్షిస్తాడంటారు. కానీ, రక్షిస్తాడనే డిఫరెంట్‌ ఎలిమెంట్‌తో ఈ చిత్రం నిర్మించాం. ఇటీవల విడుదల చేసిన డిజిటల్‌ పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకుంది. ఆ పోస్టర్‌లో ఆంజనేయస్వామి పోలీస్‌ గెటప్‌లో కనిపించడం ఆసక్తికరంగా ఉందని అంటున్నారు. ఫ్యాన్సీ రేట్‌తో హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ అమ్ముడుపోవడం ఆనందంగా ఉంది. ఏప్రిల్‌ 7న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement