జగదాంబ థియేటర్‌లో సందడి చేసిన హీరో

Raju Gari Gadhi 3 Hero Ashwin Visited Vizag Jagadamba Theatre - Sakshi

సాక్షి, విశాఖపట్నం : నగరంలోని జగదాంబ థియేటర్‌లో శుక్రవారం రాజుగారి గది 3 చిత్రం హీరో అశ్విన్ సందడి చేశారు. అశ్విన్ హీరోగా ఓంకార్‌ దర్శకత్వం వహించిన ‘రాజుగారి గది 3’ చిత్రం గత శుక్రవారం విడుదల అయిన విషయం తెలిసిందే. స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో హీరోతో పాటు బాలాజీ ఫిల్మ్స్ డిస్డ్రిబ్యూటర్ సురేష్ రెడ్డి, జగదాంబ థియేటర్ మేనేజర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో హీరో అశ్విన్‌ మాట్లాడుతూ.. రాజుగారి గది 3 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.  ఈ చిత్రంతో తాను మంచి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నానని అన్నారు. చిత్రంలో కామెడీ బావుందని, కుటుంబ సమేతంగా చూసేలా తెరకెక్కడంతో.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నారు. చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటించి ఉంటే మరింత హైప్ వచ్చి ఉండేదని అభిప్రాయపడ్డారు.

సినిమా పాజిటిల్‌ టాక్ తెచ్చుకొవడంతో.. ఉత్తరాంధ్ర ప్రాంతమైన విశాఖ నుంచే విజయ యాత్రను ప్రారంభించామని పేర్కొన్నారు. విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని, విశాఖ ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారని అభిప్రాయపడ్డారు. చివరగా ప్రేక్షకుల ఆదరణతోనే తాను నటుడిగా రాణిస్తున్నానని హర్షం వెలిబుచ్చారు.

చదవండి: 'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top