 
															లింగ... డిసైడ్ చేశాడట..
లింగ సినిమా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు
	చెన్నై:  లింగ సినిమా వివాదానికి ఫుల్స్టాప్ పెట్టడానికి సూపర్ స్టార్ రజనీకాంత్ రంగంలోకి దిగారు.   తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ....ఎక్కు తొలిమెట్టు... కొండను ఢీకొట్టు...అంటూ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు  కొంతసొమ్ము  చెల్లించడానికి  'దళపతి' ముందుకొచ్చినట్టు  తెలుస్తోంది.  అయితే ఎంత డబ్బు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయాన్ని తమిళ  సినీ నిర్మాతల  మండలి అధ్యక్షుడు కలైపులి ఎస్.థాను  ధృవీకరించారు.   సమస్య పరిష్కారమైందనీ, డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన విరమించారని ఆయన ప్రకటించారు.
	కాగా  లింగ సినిమా పంపిణీ దారులకు , నిర్మాత రాక్ లైన్ వెంకటేష్కు  మధ్య  గత రెండు నెలలుగా వివాదం నడుస్తోంది.  తాము నష్టపోయిన  సుమారు 35 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఆందోళనకు దిగి ఉద్యమించారు. గత నెలలో రజనీ ఇంటిముందు  భిక్షాటన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.   కె.ఎస్. రవికుమార్  దర్శకత్వంలో రజనీకాంత్ సరనస అనుష్క,  సోనాక్షి హీరోయిన్లుగా,   డిసెంబర్ 12, 2014లో భారీ అంచనాలతో  రిలీజైన మూవీ  లింగ.  రజనీకాంత్  సినీ జీవితంలో డిజాస్టర్గా నిలిచి భారీ నష్టాలను మూటగట్టుకుంది.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
