హీరోగా రాజశేఖర్ మేనల్లుడు | Rajasekhar's Nephew As a hero in 88 | Sakshi
Sakshi News home page

హీరోగా రాజశేఖర్ మేనల్లుడు

Jul 26 2016 3:05 AM | Updated on Sep 4 2017 6:14 AM

హీరోగా రాజశేఖర్ మేనల్లుడు

హీరోగా రాజశేఖర్ మేనల్లుడు

నటుడు రాజశేఖర్ చెల్లెలి కొడుకు మదన్ హీరోగా పరిచయం అవుతున్నారు. అంతే కాదు ఈయనే కథ,కథనం,దర్శకత్వం

తమిళసినిమా: నటుడు రాజశేఖర్ చెల్లెలి కొడుకు మదన్ హీరోగా పరిచయం అవుతున్నారు. అంతే కాదు ఈయనే కథ,కథనం,దర్శకత్వం బాధ్యతలను భుజాలపై వేసుకుని తెరకెక్కిస్తున్న చిత్రం పేరు 88. జేకే మూవీమేకర్స్ పతాకంపై ఏ.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో మదన్ సరసన ఉపాస్నారాయ్ నాయకిగా నటిస్తున్నారు.
 
  ఇతర పాత్రల్లో జయప్రకాశ్, డేనియల్ బాలాజీ,మీరాక్రి ష్ణన్,పవర్‌స్టార్,శ్యామ్,అప్పుకుట్టి,చాప్లిన్‌బాలు,సిజర్‌మనోహర్, చరణ్‌రాజ్, బాయ్స్ రాజన్ తదితరులు నటిస్తున్నారు.  దయారత్నం సంగీత దర్శకత్వం, వెట్ట్రి ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి శక్తిశరవణన్ పోరాట దృశ్యాలను కంపోజ్ చేస్తున్నారు. కాగా చిత్ర వివరాలను దర్శక-హీరో మదన్ తెలుపుతూ ఈ నాగరిక యుగంలో దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి విపరీతాలకు దారి తీస్తోందన్నారు.
 
  ఇది మన సంస్కృతి, సంప్రదాయాలకు తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి అంశాలను ఆవిష్కరించే చిత్రమే 88 అని తెలిపారు. కొన్ని అంశాలను రహస్యంగా ఉంచుకోకపోవడం వల్ల జరిగే  తీవ్రమైన అనర్థాలను చెప్పే చిత్రం ఇదన్నారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై,కుంభకోణం,కేరళ ప్రాంతాలలో నిర్వహించినట్లు మదన్ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement