కమల్‌కు కుదిరింది.రజనీకే..

Rajani and Kamal get more audience with their latest films - Sakshi

తమిళసినిమా:  కమలహాసన్, రజ నీకాంత్‌ సినీదురంధురులే. నటులుగా ఎవరికి వారే నిష్ణాతులు. సీనియర్‌ అంశానికి వస్తే కొంచెం కమలహాసనే ఎక్కువ. వీరిలో ఒకరిది క్లాస్‌ ఫాలోయింగ్, మరొకరిది మాస్‌ ఫాలోయింగ్‌. కమల్, రజనీ ఇద్దరు మంచి మిత్రులు. కలిసి పలు చిత్రాల్లో నటించారు. ఇది నిజ జీవితం, సినీ జీవితాలకు సంబంధించిన అంశం మాత్రమే. తాజాగా ఈ సినీ దిగ్గజాలిద్దరూ రాజకీయ రణరంగంలోకి దూకుతున్నారు. రణరంగం అని ఎందుకు అనాల్సి వచ్చిం దంటే రాజకీయాల్లో ప్రత్యక్ష యుద్ధాలు లేకపోయినా, మాటల యుద్ధాలు తూటాల్లా పేలుతుంటాయి. అలాం టి యుద్ధంలో ప్రజల మనసులను గెలుచుకోవాల్సి ఉంటుంది. రాజకీయాలకు సినీ గ్లామర్‌ మాత్రమే చాలదంటారు. అంతకు మించి కావలసి ఉంటుంది. రజనీ, కమల్‌ మాత్రం తమ తాజా చిత్రాలతో మరింత  ప్రేక్షకాదరణ పొంది, దాన్ని ఓట్లుగా మార్చుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు. కమల్‌ రాజకీయ ప్రవేశంపై వెల్లడించినప్పుడు సినిమాలకు స్వస్తేనా? అనే ప్రచా రానికి శ్రీకారం పడింది. ఆ తరువాత రజనీకాంత్‌ తానూ రాజకీయ రంగప్రవేశం చేశాను అనగానే కమ ల్‌కు తలెత్తిన ప్రశ్నే ఆయనకు వర్తించింది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 2.ఓ, కాలా చిత్రాలే చివరి చిత్రాలు అనే ప్రచారం జరిగింది. అలాంటిది రజనీకాంత్‌ ఒక మంచి రాజకీయ నేపథ్యంలో సాగే చిత్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం హోరెత్తుతోంది.

కమల్‌ కూడా విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చిత్రాలను విడుదల చేసి రాజకీయాలపై దృష్టి సారించాలని భావించినా,  ఇప్పుడు ఇండియన్‌–2కు రెడీ అవుతున్నారు. ఇంతకు ముందు శంకర్‌ దర్శకత్వంలో అవినీతిపై పాశుపతాస్త్రం లాంటి కథా ఇతివృత్తంతో ఓ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన రాజకీయాల జోలికి పోలేదు కాబట్టి  ఒక చిత్రంగానే కమల్‌ భావించారు,ప్రేక్షకులు ఆదరించారు. ఇండియన్‌–2 విషయానికి వస్తే, కమల్‌ ఈ చిత్రాన్ని తన రాజకీయ జీవితానికి వాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. ఇప్పటికే దర్శకుడు శంకర్‌ చిత్ర ప్రీప్రొడక్షన్‌ పనులపై దృష్టి పెట్టారు. చిత్రానికి యువ సంగీతదర్శకుడు అనిరుద్‌ను, సౌండ్‌ డిజైనర్‌గా 2.ఓ చిత్రానికి పనిచేస్తున్న విశ్వనా«థ్‌సుందర్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం. ఇతర నటీనటులు,సాంకేతిక వర్గాన్ని ఎంపిక చేసి త్వరలోనే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాంటి రాజకీయ నేపథ్యంతో కూడిన కథలో నటించాలని రజనీ కూడా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌కు ఇండియన్‌ 2 కుదిరింది. మరి రజనీకి కథ ఎప్పుడు సెట్‌ అవుతుంది. ముదల్వన్‌ 2 చేయాలన్న ఆలోచన రజనీకాంత్‌కు ఉన్నట్లు టాక్‌. అది నెరవేరాలంటే శంకర్‌ ముందు కమల్‌తో ఇండియన్‌ 2 పూర్తి చేసిన తరువాతే జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో? ఎవరి యుక్తి ఎలాంటి రిజల్ట్‌నిస్తుందో. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top