క్లెప్టోమేనియా అని అదేదో కొత్త జబ్బంట! | Raj Tarun Rajugadu Teaser | Sakshi
Sakshi News home page

Mar 18 2018 11:16 AM | Updated on Mar 18 2018 5:49 PM

Raj Tarun Rajugadu Teaser - Sakshi

రాజుగాడు సినిమాలో రాజ్‌తరుణ్‌, అమైరా దస్తూర్‌

యంగ్ హీరో రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రాజుగాడు. డిఫరెంట్‌ క్యారెక్టర్స్‌ తో ఆకట్టుకుంటున్న రాజ్‌ తరుణ్ ఈసినిమాలో క్లెప్టోమేనియాతో ఇబ్బంది పడే కుర్రాడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తనకు అవసరం లేకపోయినా.. తన ప్రమేయం లేకుండానే దొంగతనం చేసే వింత వ్యాధితో బాధపడే కుర్రాడి కనిపిస్తున్నాడు రాజ్‌ తరుణ్‌. అమైరా దస్తూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాతో సంజనా రెడ్డి దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.

ఏకె ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్‌, 30 ఇయర్స్‌ పృథ్వీ, సితారలు ఇతర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేశారు చిత్రయూనిట్‌. రాజ్‌ తరుణ్ మరోసారి ఎనర్జిటిక్‌ పర్ఫామెన్స్‌ తో ఆకట్టుకోగా రాజేంద్ర ప్రసాద్‌ తండ్రిపాత్రలో తన మార్క్‌ చూపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement