'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' | Raj Tarun Next movie title Kittu Unnadu Jagartha | Sakshi
Sakshi News home page

'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'

Oct 25 2016 3:55 PM | Updated on Sep 4 2017 6:17 PM

'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'

'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త'

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో రాజ్ తరుణ్. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్...

టాలీవుడ్ యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు హీరో రాజ్ తరుణ్. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా.. హీరోగా మంచి విజయాలు సాధిస్తున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న  సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్ను ఫిక్స్ చేశారు.

వంశీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'కిట్టూ ఉన్నాడు జాగ్రత్త' అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. రాజ్ తరుణ్ సరసన అనూ ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement