ఇన్‌ రాఘవన్‌

Raghavan Seqwel In Nayanthara - Sakshi

తమిళంలో టాప్‌ స్టార్స్‌ నుంచి యంగ్‌ హీరోస్‌ వరకు అందరితో యాక్ట్‌ చేశారు నయనతార. ఒక్క కమల్‌ హాసన్‌తో తప్ప. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ కలవబోతోందని కోలీవుడ్‌ టాక్‌. దర్శకుడు గౌతమ్‌ మీనన్, కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో 2006లో ‘వేట్టయాడు విలయాడు’  (తెలుగులో ‘రాఘవన్‌’గా విడుదలయింది) సినిమా వచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ను రూపొందిస్తున్నారు గౌతమ్‌ మీనన్‌. ఇందులో హీరోయిన్‌గా అనుష్క నటిస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి.. నయన ఇన్‌ రాఘవన్‌ వార్త నిజమేనా? ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top