
‘‘సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘రచయిత’. కథ నాకు బాగా నచ్చడంతో నటించాలనుకున్నా. కానీ, నా డేట్స్ కుదరకపోవడంతో చేయలేకపోయా. నా మిత్రుడు విద్యాసాగర్ రాజు మంచి సినిమా తీశాడనే ఉద్దేÔè ంతో, చిన్న సినిమా బతకాలనే తపనతోనే నేను సపోర్ట్ చేస్తున్నా. అందులో భాగంగానే నా ఫేస్‌బుక్ ద్వారా పాటలు రిలీజ్ చేశాం’’ అని నటుడు జగపతిబాబు అన్నారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో దుహర మూవీస్ సమర్పణలో కొత్త నటీనటులతో కళ్యాణ్ ధూళిపాళ నిర్మిస్తోన్న సినిమా ‘రచయిత’. చంద్రబోస్ పాటలు రచించారు.
మలయాళ సంగీత దర్శకుడు శ్యామ్ స్వరపరచిన ఈ సినిమా పాటలను హైదరాబాద్‌లోని చంద్రబోస్ నివాసంలో జగపతిబాబు విడుదల చేసి, మాట్లాడుతూ... ఇండస్ట్రీలో పెద్ద వాళ్లు పైపైకి ఎదుగుతున్నారు. చిన్నవాళ్లు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నారనే ఆవేదనతో నేను ‘రచయిత’ సినిమాకి సపోర్ట్ చేస్తున్నా. ఈ సినిమాకు ప్రీ రిలీజ్ వేడుక చేయకుండా డైరెక్ట్‌గా పబ్లిక్‌కి చేరువయ్యేలా డిసెంబర్ 8న ఓ థియేటర్లో సినిమా ప్రదర్శిస్తున్నాం. ఆ థియేటర్ బయట నేను స్వయంగా నిలబడి ప్రేక్షకుల రివ్యూ తెలుసుకోబోతున్నా’’ అన్నారు. ‘‘పాటలు రచించడానికి నేను ఎక్కడికీ వెళ్లను. నా ఇంట్లోనే రాస్తా. అందుకే ‘రచయిత’ పాటలు నా ఇంట్లో జగపతిబాబుగారి సమక్షంలో విడుదల చేశాం’’ అన్నారు చంద్రబోస్.