చిన్న బ్రేక్ తర్వాత పెద్ద సినిమా!
వేరు వేరు డైరెక్షన్‌లో వెళుతున్న ఇద్దరు కలసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి.
వేరు వేరు డైరెక్షన్‌లో వెళుతున్న ఇద్దరు కలసి సినిమా చేస్తే అంచనాలు భారీగా ఉంటాయి. బాలకృష్ణ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ సినిమాపై అలాంటి అంచనాలే నెలకొన్నాయి. పూరి తనదైన శైలిలో ఈ చిత్రాన్ని స్పీడ్‌గా తీస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు కథానాయికలు ఉంటారట. ఇప్పటికే ఓ నాయికగా ముస్కాన్‌ని ఎంపిక చేశారు. మరో నాయిక పాత్రకు పేరున్న తారను తీసుకోవాలనుకుంటున్నారని సమాచారం. ఆ ఛాన్స్ అమలాపాల్‌కి దక్కిందని భోగట్టా. పూరి దర్శకత్వం వహించిన ‘ఇద్దరమ్మాయిలు’లో అమలా పాల్ నాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
ఈ మలయాళ కుట్టి నటనకు ఇంప్రెస్ అయిన పూరి తాజా చిత్రంలో బాలకృష్ణ సరసన ఓ కథానాయికగా ఎంపిక చేశారని ఫిల్మ్‌నగర్ టాక్. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో అమలా పాల్ ‘ఆయుష్మాన్ భవ’ అనే చిత్రం అంగీకరించారు. దర్శకుడు విజయ్‌తో వివాహ బంధానికి ముగింపు పలికిన తర్వాత ఈ బ్యూటీ కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టారు. అందుకే, ఇకనుంచి వరుసగా సినిమాలు అంగీకరించాలనుకుంటున్నారట!


