ఓ ముద్దు.. మూడు వేల కేలరీలు | Puri Jagannadh's 'Heart Attack' aimed at urban audience with romantic attitude | Sakshi
Sakshi News home page

ఓ ముద్దు.. మూడు వేల కేలరీలు

Nov 27 2013 6:45 PM | Updated on Sep 2 2017 1:02 AM

ఓ ముద్దు.. మూడు వేల కేలరీలు

ఓ ముద్దు.. మూడు వేల కేలరీలు

రొటిన్ కు భిన్నంగా ఉండేలా, ఆకట్టుకునేలా సినిమా టైటిల్స్ పెట్టడంలో టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ ది ఓ డిఫరెంట్ స్టైల్.

రొటిన్ కు భిన్నంగా ఉండేలా, ఆకట్టుకునేలా సినిమా టైటిల్స్ పెట్టడంలో టాలీవుడ్ లో పూరి జగన్నాథ్ ది ఓ డిఫరెంట్ స్టైల్. తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న రొమాంటిక్ డ్రామా చిత్రం 'హార్ట్ ఎటాక్'. బుధవారం 'హార్ట్ ఎటాక్' ఫస్ట్ లుక్ ను పూరి జగన్నాథ్ ఆన్ లైన్ లో విడుదల చేశారు. రొమాంటిక్ గా ఉండే ఆర్భన్ ప్రేక్షకులను లక్ష్యంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు పూరి జగన్నాథ్ తెలిపారు. 
 
నితిన్ రెడ్డి, ఆదా శర్మలు ఓ ఇంచు దూరంలో ముద్దు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్న ఆకర్షణీయమైన పోస్టర్ ను విడుదల చేశారు.  'మూడు వేల కేలరీస్ ను కోల్పోయేలా ఓ గంటపాటు ముద్దు పెట్టుకోవాలి' అనే ట్యాగ్ లైన్ తో కేకపుట్టించారు. ఈ చిత్రానికి నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న పూరి.. స్పెయిన్ లో షూటింగ్ చేస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే సంవత్సరంలో విడుదల కానుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement