పూరి మొదలెట్టేస్తున్నాడు..! | puri jaganath next movie heroine amyra dastar | Sakshi
Sakshi News home page

పూరి మొదలెట్టేస్తున్నాడు..!

Nov 15 2015 1:20 PM | Updated on Apr 8 2019 7:50 PM

పూరి మొదలెట్టేస్తున్నాడు..! - Sakshi

పూరి మొదలెట్టేస్తున్నాడు..!

హిట్ ఫ్లాప్లతో సంబందం లేకుండా జెట్ స్పీడ్తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్.

హిట్ ఫ్లాప్లతో సంబందం లేకుండా జెట్ స్పీడ్తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ఏడాది మొదట్లోనే టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన పూరి ప్రస్తుతం మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లోఫర్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను లైన్లో పెట్టేశాడు పూరి.

కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ హీరోగా 'రోగ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. లోఫర్ రిలీజ్కు ముందే ఈ సినిమాను ప్రారంభించి సమ్మర్ బరిలో నిలపాలని భావిస్తున్నాడు. అందుకే లోఫర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు 'రోగ్' ప్రీ ప్రొడక్షన్, నటీనటుల ఎంపిక చేసేస్తున్నాడు. కన్నడలో తెరకెక్కనున్న ఈ సినిమాలో క్యూట్ హీరోయిన్ అమైరా దస్తర్ను హీరోయిన్గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.

ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు సినిమాలో హీరోయిన్గా నటించిన అమైరా ప్రస్తుతం టాలీవుడ్లో కూడా హవా చూపించడానికి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా సెలెక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్లు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే కష్టపడుతుంటే పూరి మాత్రం రెండు,మూడు సినిమాలతో జోరు చూపిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement