breaking news
Lofer
-
బాలీవుడ్ మూవీ కోసం దిశా..!
ఈ జనరేషన్ హీరోలతో కాలు కదపడానికి హీరోయిన్లు చాలానే కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా టైగర్ ష్రాఫ్ లాంటి ఎనర్జిటిక్ డాన్సర్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలంటే హీరోయిన్లకు సవాలే. అందుకే ఓ ముద్దుగుమ్మ ఈ యంగ్ హీరోతో ఆడిపాడేందుకు తెగ కష్టపడుతోంది. స్పెషల్‌గా డ్యాన్స్ ప్రాక్టీస్ కోసం టైం కేటాయించి విపరీతంగా ప్రాక్టీస్ చేసేస్తోంది. లోఫర్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన ముద్దుగుమ్మ దిశాపటాని. తొలి సినిమాతోనే క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకున్న ఈ బ్యూటి వెంటనే బాలీవుడ్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి బేఫికరాలో నటిస్తున్న ఈ బ్యూటి ఓ డ్యాన్స్ సీక్వన్స్ కోసం తెగ కష్టపడి ప్రాక్టీస్ చేస్తోంది. అంతేకాదు తన ప్రాక్టీస్ వీడియోను అభిమానుల కోసం ట్విట్టర్లో షేర్ చేసింది. -
వెనక్కివ్వాలా? వద్దా?
‘లోఫర్’ చిత్రానికి సంబంధించి దర్శకుడు పూరీ జగన్నాథ్‌కూ, డిస్ట్రిబ్యూటర్స్ ముత్యాల రామ్‌దాస్, అభిషేక్, కాలి సుధీర్లకూ మధ్య తలెత్తిన వివాదం ఇప్పుడు సినీ రంగాల్లో హాట్ టాపిక్. ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లూ తనపై దాడి చేశారని పూరీ కేసు పెడితే, అవన్నీ వట్టి తప్పుడు కేసులంటూ వారు సోమవారం మీడియా ముందుకు వచ్చి వాపోయిన సంగతి మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంపై మంగళవారం ‘సాక్షి’ ప్రచురించిన ప్రత్యేక కథనం ‘కట్ చేస్తే... కాంట్రవర్సీ!’కి విశేష స్పందన వచ్చింది. అలాగే, ఈ వివాదంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. వారి అభిప్రాయాలు... వారి మాటల్లోనే... కాంబినేషన్స్‌నే నమ్మితే ముప్పే! ‘‘ఇవాళ సినిమాల్లో నూటికి 20 సినిమాలే, అవీ క్రేజున్నవే - బయ్యర్లు కొంటున్నారు. మిగిలిన 80 శాతం సినిమాల్ని నిర్మాతలే రిలీజ్ చేసుకొని, రిస్క్ భరిస్తున్నారు. ఆ రకంగా నిర్మాతలే ఎక్కువ నష్టపోతున్నారు. మరోపక్క డిస్ట్రిబ్యూటర్లు ఇష్టపడి, పోటీపడి మరీ ‘అవుట్ రైట్’ కన్నా ఎక్కువ సొమ్ముకి ‘నాన్ రికవరబుల్ అడ్వాన్స్’ పద్ధతిలో సినిమా కొంటున్నారు. అలా కొన్నాక, తీరా నష్టమొస్తే అది ఎవరి తప్పు? కొనుక్కున్న వాళ్ళదే కదా! దాన్ని నిర్మాతో, టెక్నీషియనో భర్తీ చేయాలనడం తప్పు. లెక్కప్రకారమైతే ఎవరూ భర్తీ చేయనక్కరలేదు. రజనీకాంత్ లాంటి వాళ్ళకు చిత్ర నిర్మాణంలోనూ వాటా ఉంటుంది కాబట్టి, వారు ‘బాబా’(2002) లాంటి చిత్రాలకు కొంత మొత్తం వెనక్కి ఇస్తే ఇచ్చారు. ఐనా, నిర్మాతకూ, డిస్ట్రిబ్యూటర్కీ మధ్య జరిగిన వ్యాపార ఒప్పందంలో దర్శకుడికీ, హీరోకీ సంబంధం ఏంటి? క్రేజీ కాంబినేషన్స్ నమ్మి, సినిమాను చూడకుండానే కొనుక్కుంటే ఇదే ముప్పు. తీరా చేతులు కాలాక, అప్పుడు కొత్త చిత్రాలకు సహాయ నిరాకరణ లాంటి బ్లాక్‌మెయిలింగ్‌కు దిగితే మరీ తప్పు. ఐనా, ఇవన్నీ కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశాలు. రోడ్డు మీదకెక్కడం బాధాకరం.’’ - తమ్మారెడ్డి భరద్వాజ, ప్రముఖ నిర్మాత - దర్శకుడు పోటీపడి కొనడమెందుకు? నష్టపోవడమెందుకు? ‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కు 20 శాతం కన్నా మించి నష్టం వస్తే, కోటి రూపాయల పారితోషికం తీసుకొనే నటీనటులు, టెక్నీషియన్లు తమ పారితోషికంలో కొంత వెనక్కి ఇవ్వాలని ఏణ్ణర్ధం క్రితమే ఒక ప్రతిపాదన వచ్చింది. కానీ అది సాధ్యం కాదనీ, డిస్ట్రిబ్యూటర్లు తాము ఒప్పందం కుదుర్చుకున్న నిర్మాతలతోనే ఆ డబ్బుల వ్యవహారం చూసుకోవాలనీ మా దర్శకుల సంఘం తరఫున లేఖ ఇచ్చే శాం. అయినా, డిస్ట్రిబ్యూటర్లు రికవరబుల్ ఎడ్వాన్స్ పద్ధతిలో కూడా సినీ వ్యాపారం చేసుకొనే అవకాశం ఉండగా, నాన్ రికవరబుల్ ఎడ్వాన్స్ (ఎన్.ఆర్.ఎ) పద్ధతిలో రేట్లు పెంచి, పోటీపడి సినిమాలు కొనడమెందుకు? నష్టపోవడమెందుకు? ఆ తరువాత నష్టం కొంతైనా భర్తీ చేసేలా డబ్బులు వెనక్కి ఇవ్వమంటూ, ‘బెగ్గింగ్ చేస్తున్నా’మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడమెం దుకు? మునుపటి చిత్రాల రిజల్ట్‌ను బట్టే సాగే సినిమా వ్యాపారంలో ‘ఇడియట్’ అవుతుందనుకొని ‘లోఫర్’ కొన్నామని వ్యాపారస్థులైన డిస్ట్రిబ్యూటర్లు చెప్పడం అమాయకత్వమే. రేట్లు పెంచి టికెట్లు అమ్మడం, కెపాసిటీకి మించి హాళ్ళలోకి జనాన్ని పంపి, ఆ కలెక్షన్లను బట్టి హీరోలు, దర్శకుల పారితోషికాలు కోట్లలోకి పెరగడానికి బాధ్యత పరోక్షంగా డిస్ట్రిబ్యూటర్లదే. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు వ్యతిరేకిస్తున్న ఆన్లైన్ టికెట్ విధానాన్ని ఇప్పటికైనా ప్రభుత్వాలు తెస్తే, పారదర్శకత వస్తుంది. నిర్మాతకు సరిగ్గా డబ్బు, ప్రభుత్వ ఖజానాకు వినోద పన్ను మొత్తం అందుతాయి. దానికి శ్రీకారం చుట్టాల్సింది డిస్ట్రిబ్యూటర్లే!’’ - వీరశంకర్, ప్రముఖ దర్శకుడు - ‘తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం’ అధ్యక్షుడు ఇప్పుడిక ఒళ్ళు దగ్గర పెట్టుకొంటారు! ‘‘ఒకప్పుడు ఎన్టీయార్, కృష్ణ, చిరంజీవి గారి లాంటి హీరోలకు పర్మనెంట్‌గా, స్టాండర్డ్ నిర్మాతలుండేవారు. డిస్ట్రి బ్యూటర్లూ ఉండేవారు. అందరూ ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకొనేవారు. ఇవాళ తెలుగులో ఏ హీరోకూ పర్మనెంట్ నిర్మాతలూ, డిస్ట్రిబ్యూటర్లూ లేరు. హీరోలు, దర్శకులు మార్కెట్‌కు మించి ఎక్కువ డబ్బులు అడుగుతు న్నారు, తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో మొత్తం వ్యవస్థే నాశనమైంది. నిర్మాతలకూ, హీరోలకూ డబ్బులు రావడానికి కారణమైన డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల వాళ్ళు కూడా లేకుండా పోతే, ఇక సినిమాలు రిలీజ్ చేసేదెవరు? ఆడేదెవరు? కాబట్టి, వాళ్ళను కాపాడుకోవాలి. సినిమాలో నష్టమొస్తే, దర్శక, హీరోలు డబ్బులు వెనక్కివ్వాలి. డెరైక్టర్ డబ్బులు వెనక్కివ్వడం ‘ధైర్యం’ (2005) సినిమాతో నాతోనే మొదలైంది. సినిమా ఆడక పోతే, డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుందంటే అప్పుడు దర్శకులు, హీరోలు ఒళ్ళు దగ్గరపెట్టుకొని, సరైన కథలతో సిన్మా తీస్తారు. కాబట్టి, డబ్బులు వెనక్కి ఇమ్మని డిస్ట్రిబ్యూటర్లు అడగడం శుభపరిణామం. నాకు నచ్చింది.’’ - తేజ, ప్రముఖ దర్శకుడు - నిర్మాత - పంపిణీదారు - ప్రదర్శకుడు -
మేకింగ్ ఆఫ్ మూవీ-లోఫర్
-
మాస్‌లుక్‌కు మంచి రెస్పాన్స్
మెగా హీరో వరుణ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'లోఫర్'. తొలి రెండు సినిమాలతో ప్రయోగాత్మక చిత్రాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్, ఈ సినిమాతో కమర్షియల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. ముకుంద సినిమాతో ఆకట్టుకోలేకపోయిన మెగా వారసుడు, కంచె సినిమాతో నటుడిగా మంచి మార్కులు సాధించాడు. ఇప్పుడు లోఫర్ సినిమాతో కమర్షియల్ స్టార్‌గా కూడా ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌తో పాటు ట్రైలర్‌కు కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన లోఫర్ ట్రైలర్ ఆన్లైన్లో పదిలక్షల వ్యూస్‌తో సత్తా చాటింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఇప్పటికే షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
పూరి మొదలెట్టేస్తున్నాడు..!
హిట్ ఫ్లాప్‌లతో సంబందం లేకుండా జెట్ స్పీడ్‌తో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ ఏడాది మొదట్లోనే టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ సాధించిన పూరి ప్రస్తుతం మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా లోఫర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లోఫర్ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ సినిమాను లైన్లో పెట్టేశాడు పూరి. కన్నడ స్టార్ ప్రొడ్యూసర్ సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ హీరోగా 'రోగ్' సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. లోఫర్ రిలీజ్‌కు ముందే ఈ సినిమాను ప్రారంభించి సమ్మర్ బరిలో నిలపాలని భావిస్తున్నాడు. అందుకే లోఫర్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు 'రోగ్' ప్రీ ప్రొడక్షన్, నటీనటుల ఎంపిక చేసేస్తున్నాడు. కన్నడలో తెరకెక్కనున్న ఈ సినిమాలో క్యూట్ హీరోయిన్ అమైరా దస్తర్ను హీరోయిన్గా ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేకుడు సినిమాలో హీరోయిన్గా నటించిన అమైరా ప్రస్తుతం టాలీవుడ్లో కూడా హవా చూపించడానికి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ (వర్కింగ్ టైటిల్)లో కూడా ఈ ముద్దుగుమ్మనే హీరోయిన్గా సెలెక్ట్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. స్టార్ డైరెక్టర్లు ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే కష్టపడుతుంటే పూరి మాత్రం రెండు,మూడు సినిమాలతో జోరు చూపిస్తున్నాడు. -
లోఫర్ షూటింగ్ స్టార్ట్ చేసిన పూరి