పాటకు ఆస్కారం? | Pulimurugan's music in Oscar 2018's eligibility list for Best Song and Background Score | Sakshi
Sakshi News home page

పాటకు ఆస్కారం?

Dec 20 2017 12:18 AM | Updated on Dec 20 2017 12:18 AM

Pulimurugan's music in Oscar 2018's eligibility list for Best Song and Background Score - Sakshi

ఆస్కార్‌ ఆశలు ఇంకా చెదిరిపోలేదు. ‘న్యూటన్‌’ అవుట్‌ అయిందని బాధపడక్కర్లేదు. ఆస్కార్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. ఈసారి బాలీవుడ్‌ కాదు మాలీవుడ్‌ సినిమా రేసులో ఉంది. బెస్ట్‌ ఫారిన్‌ చిత్రం క్యాటగిరీలో ‘న్యూటన్‌’ అవుట్‌ అయ్యాక బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఓ ఇండియన్‌ సినిమాకి అవకాశం దక్కింది. ఆస్కార్‌ అవార్డ్స్‌ అందించే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ సంస్థ ఈ సంవత్సరం ఆస్కార్‌ ఆవార్డ్స్‌ గెలిచే అవకాశం ఉన్న 70 పాటల లిస్ట్‌ను ప్రకటించింది.

ఆ లిస్ట్‌లో మలయాళ సంగీతదర్శకుడు గోపీసుందర్‌ స్వరపరచిన ‘పులిమురుగన్‌’లోని రెండు పాటలు (‘కాదనయుమ్‌ కల్చిలంబే, మానతే మారికురంబే’) స్థానం సంపాదించుకోగలిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఎన్నుకున్న 70 పాటల్లో  పాప్‌ సంగీత సంచలనాలు టేలర్‌ స్విఫ్ట్, నిక్‌ జోన్స్‌తో పాటు  గోపీసుందర్‌ సమకూర్చిన రెండు పాటలు ఉండటం విశేషం.

ఈ విషయమై గోపీసుందర్‌ స్పందిస్తూ – ‘‘ఈ లిస్ట్‌ను మొదటిసారి చూసి నమ్మలేదు. కానీ, అకాడమీ సంస్థ నుంచి అఫీషియల్‌ మెయిల్‌ వచ్చేసరికి నమ్మక తప్పలేదు. నాకు ఇప్పటి వరకు స్టేట్‌ అవార్డ్‌ రాలేదు కానీ, నేషనల్‌ అవార్డ్‌ లభించింది. ప్రేక్షకులకు నచ్చటమే అంతిమ విజయంగా భావిస్తా’’ అన్నారు. మోహన్‌లాల్‌ హీరోగా నటించిన ‘పులిమురుగన్‌’ తెలుగులో ‘మన్యం పులి’గా విడుదలై, ఇక్కడా విజయం సాధించింది. 100 కోట్ల క్లబ్‌ చేరుకున్న తొలి మాలీవుడ్‌ మూవీగా పేరు సంపాదించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement