శ్రీదేవి ఎవరు? | Producer Boney Kapoor reportedly registers '20 odd titles' for documentary on Sridevi's life | Sakshi
Sakshi News home page

శ్రీదేవి ఎవరు?

May 1 2018 12:15 AM | Updated on May 1 2018 11:02 AM

Producer Boney Kapoor reportedly registers '20 odd titles' for documentary on Sridevi's life - Sakshi

శ్రీదేవి

నాలుగేళ్ల వయసులో వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి జీవితంలో ఎక్కువ భాగం నటిగానే కొనసాగారు శ్రీదేవి. భౌతికంగా లేకపోయినా.. నటించిన చిత్రాలు, విభిన్నమైన పాత్రల రూపంలో  ప్రేక్షకుల హృదయాల్లో ఆమె నిలిచే ఉంటారు. ఇలాంటి గొప్ప నటి జీవిత చరిత్ర ఆదర్శనీయమైంది. రాబోయే కథానాయికలకు మార్గనిర్దేశం లాంటిది. అందుకే శ్రీదేవి లైఫ్‌స్టోరీతో ఆమె భర్త బోనీకపూర్‌ ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నారని బీటౌన్‌లో స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.

అందుకోసం ఈయన ‘శ్రీ, శ్రీదేవి, శ్రీ మ్యామ్‌’ అనే టైటిల్స్‌ను రిజిస్టర్‌ చేయించారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే శ్రీదేవి పాత్రలో నటించి, ప్రేక్షకులను మెప్పించగల నటి ఎవరు? అన్న ఆసక్తి హట్‌టాపిక్‌గా మారింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. శ్రీదేవి కూమార్తెలు జాన్వీకపూర్, ఖుషీ కపూర్‌ ఇప్పుడిప్పుడే శ్రీదేవి లేరనే బాధ నుంచి తేరుకున్నట్లు కనిపిస్తోంది. రీసెంట్‌గా జరిగిన ఓ వేడుకలో పక్కనున్న ఫొటోలోలా ఫన్నీగా కనిపించారు జాన్వీ అండ్‌ ఖుషీ.

Advertisement
 
Advertisement
Advertisement