బ్రిటీష్‌ ప్రిన్స్‌ పెళ్లికి ప్రియాంక | Priyanka Chopra Going To Participate In Royal Wedding, London | Sakshi
Sakshi News home page

May 3 2018 4:10 PM | Updated on Apr 3 2019 6:34 PM

Priyanka Chopra Going To Participate In Royal Wedding, London - Sakshi

బ్రిటీష్‌ ప్రిన్స్‌ హ్యారీ, మేఘన్‌ మార్కెల్‌, ప్రియాంక చోప్రా (ఫైల్‌ ఫోటో)

బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా బ్రిటీష్‌ రాయల్‌ వెడ్డింగ్‌కి హాజరు కానున్నారు. తన హాలీవుడ్‌ స్నేహితురాలు మేఘన్‌ మార్కెల్‌- బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీల వివాహ మహోత్సవంలో పాల్గొనాలని ఆమెకు పిలుపు అందింది. ఈ నెల 19న లండన్‌లోని విండ్సర్‌ క్యాజిల్‌లో జరగబోయే పెళ్లి వేడుకకు ప్రియాంక హాజరు కానున్నారు. తన స్నేహితురాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం అందడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. పెళ్లి కూతురు మేఘన్‌తో తన మూడేళ్ల స్నేహ బంధాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘మార్కెల్‌ మాటతీరు, నడవడిక ఎంతో బాగుంటాయి. ఆమె తన కొత్త జీవితంలో చక్కగా ఒదిగిపోతుంద’ని ప్రియాంక అన్నారు.

ప్రియాంక సన్నిహితురాలు రేచల్‌ రే దీనిపై స్పందించారు. ‘ఏమో మేఘన్‌ సాధారణ గృహిణి మాత్రమే కావచ్చునేమో’నని వ్యాఖ్యానించగా.. ‘ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అనేంత చక్కని చుక్క నా ఫ్రెండ్‌. అమ్మాయిలకు మార్గదర్శిగా నిలిచే గొప్ప వ్యక్తిత్వం గల ముద్దుగుమ్మ మేఘన్‌’ అని ప్రియాంక తన స్నేహితురాలిపై అభిమానాన్ని చాటుకున్నారు. మార్కెల్‌తో మూడేళ్ల ప్రయాణంలో తాను ఎంతో నేర్చుకున్నానని ప్రియాంక అన్నారు. ఆమె గొప్పింటికి కోడలుగా వెళ్లబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా, ప్రియాంక తన పాపులర్‌ షో ‘క్వాంటీకో’  మూడో సీజన్‌ను ఈ వారం ప్రారంభించిన విషయం తెలిసిందే.





 

Advertisement
 
Advertisement
Advertisement